తొగుట,ఏప్రిల్ 9: సిద్దిపేట జిల్లా తొగుట మండలం కాన్గల్ గ్రామ సమీ పంలోని ఓ లేయర్ పౌల్ట్రీఫారంలో బర్డ్‌ప్లూ నిర్ధారణ కావడంతో ఆ ప్రాం తానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు. కోళ్ల ఫామ్‌లో పనిచేస్తున్న సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
బర్డ్ ఫ్లూతో ఇప్పటివరకు 20వేల కోళ్లు మృతి చెందినట్లు అధికారులు తెలి పారు. మిగిలిన 50వేల కోళ్లను చంపి పూడ్చిచేయాలని నిర్ణయం తీసు కున్నారు. మొత్తం 20 బృందాలుగా ఏర్పడి కోళ్లను చంపేసి పూడ్చి పెడు తున్నారు. కిలోమీటర్ పరిధిలో ఏ కోళ్ల ఫారాలు ఉన్నా కోళ్లను చంపే యాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని సమీక్షిం చేందుకు పశు సంవర్ధక కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.