చేగుంట, అక్టోబర్ 4: బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పాలన గురించి ప్రజలకు వివరించి మరోసారి గెలిపించేలా కార్యకర్తలు కృషిచేయాలని మెదక్ ఎంపీ కొత్త ప్రబాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని సాయిబాలాజీ గార్డెన్లో బుధవారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల వారికి న్యాయం చేస్తున్నట్లు చెప్పారు. రైతుల కోసం రైతుబంధు,రైతుబీమా, దండిగా ఎరువులు, విత్తనాలు, 24గంటల ఉచిత విద్యుత్, ప్రాజెక్టులు నిర్మించి కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. ముదిరాజ్ కులస్తుల అభివృద్ధికి చెరువుల్లో వందశాతం సబ్సిడీపై ప్రభుత్వం చేపలు వదులుతూ జీవనోపాధి చూపుతుదన్నారు. సబ్సిడీపై వాహనాలు అందజేస్తుట్లు తెలిపారు. చేనేత,గీత కార్మికుల,బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నామని, పేద ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మీ పథకం ద్వారా రూ.లక్షా 116 అమ్మాయి తల్లికి అందజేస్తున్నట్లు చెప్పారు.
దళితబంధు పథకం ద్వారా ఒకో కుటుంబానికి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు 10లక్షల రూపాయలు అందజేస్తుదన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నదని తెలిపారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే అనేక సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అన్నారు. మూడోసారి తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రతి కార్యకర్త పార్టీకోసం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పాలన గురించి ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. మండల బూత్ సమన్వయ కమిటీలతో పాటు అన్ని గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అధిక మెజార్టీ తీసుకువచ్చే బూత్ కమిటీ సభ్యులకు తగిన గౌరవం ఉంటుందని, పార్టీ తరపున అన్నివిధాలా వారికి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని, ఈ తొమ్మిదేండ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి విస్తృతంగా ప్రజల ముందు ఉంచాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్‌రావు, చక్ర నర్సింహరెడ్డి, చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీలు ముదాం శ్రీనివాస్, బాణపురం కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రజనక్ ప్రవీణ్‌కుమార్, సొసైటీ చైర్మన్ వంటరి కొండల్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రంగాయ్యగారి రాజిరెడ్డి, తానీషా, ఎర్ర యాదగిరి, మైలరాం రాంచంద్రం, జీవన్‌రెడ్డి, వేణుగోపాల్‌శర్మ, సర్పంచులు బుడ్డ స్వర్ణలతబాగ్యరాజ్, రాములు, సంతోష్‌రెడ్డి, కొటారి అశోక్, కుమ్మరి శ్రీనివాస్, ఊరడి మహిపాల్, కాశబోయిన భాస్కర్, ఎంపీటీసీలు అయితే వెంకటలక్ష్మీరఘురాములు, గాండ్ల లతనంధం, బక్కి లక్ష్మీరమేశ్, నవీన్, గణేశ్, శ్రీను, నాయకులు వడ్డెపల్లి నర్సింహులు, వంటరి అశోక్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కనుగంటి లచ్చయ్య, బాల్శివ, బాపురెడ్డి, బండి విశ్వేశ్వర్, యాదిరెడ్డి, మోహన్‌రెడ్డి, గుల్ల సిద్దిరాములు, నాగరాజు, క్రాంతి, మైనార్టీ నాయకులు మమ్మద్ అలీ, నదీం, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.