Medak | మెదక్ మున్సిపాలిటీ, మార్చి 8 : మహిళల సమానత్వం అనేది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి, సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మి శారద అన్నారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని అవుట్ డోర్ స్టేడియంలో పుట్‌బాల్ అకాడమీ ఆద్వర్యంలో జాతీయస్థాయిలో రాణించిన క్రీడాకారిణిలకు ముఖ్య అతిధిగా హాజరైన లక్ష్మి శారద చేతుల మీదుగా స్పోర్ట్కిట్స్ పంపిణి చేశారు. ఈ సందర్బంగా లక్ష్మి శారద పుట్‌బాల్ క్రీడాకారిణిలతో సరాదగా పుట్‌బాల్ ఆడారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో ఆమె మాట్లాడుతూ మహిళలు సాధించిన విజయాలు వారికి గల అడ్డంకులు, అనుభవిస్త్ను సమస్యలు వాటి పరిష్కారం కోసం ఆలోచించడానికి ఏర్పాటు చేసే కార్యక్రమమే మహిళా దినోత్సవం అన్నారు. భవిష్యత్తులో ఏమి సాధించాలనే తపన, మీరు స్వతహాగా నిలబడే వ్యక్తిత్త్వాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. సమాజంలో మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యం అన్నారు. మహిళలు అన్ని రంగాలలో పురోగమించడమే అసలైన ఆభివృద్ధి అన్నారు. విద్య, క్రీడలు, ఉపాధి, రాజకీయ రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగలన్నారు.
అంతకుముందు జిల్లా పుట్‌బాల్ ఆసోసీయేషన్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ బేటి బచావో-బేటి పడావో కార్యక్రమంలో భాగంగా అన్ని క్రీడలలో జాతీయస్థాయులో రాణించిన క్రీడాకారిణులకు (బాలికలు, మహిళలు) స్పోర్‌్ట్స కిట్స్ అందజేస్తున్నట్లు పేర్కోన్నారు. జిల్లాలోని చేగుంట, నర్సాపూర్, తూఫ్రాన్, మనోహరబాద్, కౌడిపల్లి, మెదక్, పాపన్నపేట మండలాల నుంచి సాప్ట్‌బాల్, హ్యాండ్ బాల్, పుట్‌బాల్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్‌తో పాటు అథ్లెటిక్స్ క్రీడల్లో జిల్లా తరపున ఎంపికై జాతీయస్థాయిలో పోటీల్లో మంచి ప్రతిభ కనభర్చారని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రంలో జిల్లా యువజన, క్రీడల అధికారి దామోదర్‌రెడ్డి, జిల్లా మహిళ సాధికారత కేంద్రం మిషన్ సమన్వయకర్త సంతోష, పుట్‌బాల్ అకాడమీ కార్యదర్శులు వంశీకృష్ణ, ప్రశాంత్, వినయ్ బాధ్యులు గోపాల్, బాలకృష్ణ, వ్యాయమ ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రావు, శ్యాంసుందర్, మహిపాల్, రాజేందర్, నరేష్, దేవెందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.