ఉమ్మడి మెదక్ జిల్లా న్యూస్‌నెట్‌వర్క్, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 6 : గణపతి బొప్పా మోరియా..అంటూ మిన్నంటిన నినాదాలు.. బైబై గణేశా అంటూ చిన్నాపెద్దా అనే తేడాలేకుండా వీడ్కోలు.. డప్పుల దరువులు.. తీన్మార్ నృత్యాలతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు నిర్వహించారు.
శనివారం ఉదయం నుంచే భక్తులు అట్టహాసంగా గణనాథులను నిమజ్జనానికి తరలించారు. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.