సిద్దిపేట, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాట తప్పేది లేదు.. మడమ తిప్పేదు లేదని మరోసారి తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటి చెప్పింది. సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు అంటే..అది అమలు చేసితీరుతారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు రైతుల రుణమాఫీ చేశారు. ఇవ్వాళ ఎక్కడ చూసినా రైతున్నలు రుణమాఫీ ముచ్చట్లే కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారు నాకు రుణమాఫీ చేసిండు… నా సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది అంటూ నలుగురు రైతులు కలిసిన చోట మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 99 వేల 999 రూపాయల వరకు రైతుల రుణమాఫీ జరిగింది. పద్రాగస్టు కానుకగా రైతుల అకౌంట్లో రుణమాఫీ డబ్బులు జమకావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వరాష్ట్రంలో వ్యవసాయరంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. రైతు విత్తనం నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల వ్యక్తిగత బ్యాంక్‌ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నది. సీఎం కేసీఆర్ రైతన్నలకు దన్నుగా నిలవడంతో వారంతా ఖుషీఖుషీగా ఎవుసం చేసుకుంటున్నారు. సకాలంలో ఎరువులు విత్తనాలు, పంటపెట్టుబడి, నాణ్యమైన విద్యుత్, పంట కొనుగోళ్లు ఇలా ఒకటేమిటి రైతుల అవసరాల మేరకు అన్ని సౌకర్యాలు ఈ ప్రభుత్వం కల్పిస్తున్నది.
రైతన్నకు వెన్నుదన్నుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తున్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ రుణమాఫీ చేశారు. లక్షలోపు రుణాలను మాఫీ చేస్తూ రైతుల వ్యక్తిగత బ్యాంకుఖాతాలో డబ్బులను జమ చేశారు. పంద్రాగస్టు రోజు రైతుల బ్యాంకుఖాతాలో(రూ. 99,999 వరకు) డబ్బులు పడ్డట్లు సెల్ఫోన్లకు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు బుధవారం ఆయా బ్యాంకుల వద్దకు వెళ్లి తమ రుణమాఫీ డబ్బులను తీసుకున్నారు. దీంతో బ్యాంకుల వద్ద రైతుల సందడి నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి రైతుల రుణాలను మాఫీ చేసింది.కాగా ఇప్పటికే రూ. 25 వేలు, రూ. 50వేలు ఇలా రెండు విడతలుగా రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయం తెలిసిందే.ప్రాథమికంగా అందిన సమచారం మేరకు సిద్దిపేట జిల్లాలో 81,565 మంది రైతులకు రూ. 418 కోట్లు మాఫీ అయింది.రాష్ట్ర ప్రభుత్వం వేసే ప్రతి అడుగు రైతు సంక్షేమం వైపే.. ఇప్పటికే 11 విడతలుగా రైతు బంధు అందించింది.రైతులు షావుకార్ల వద్దకు పోవుడు బంద్ చేసిన్రు. ప్రభుత్వం ఇచ్చిన పంట పెట్టుబడి సాయంతో విత్తనాలు, ఎరువులు, దున్నకం చేసుకుంటున్నారు.బ్యాంకులు వచ్చి పంట రుణాలు ఇస్తున్నాయి. ఒకప్పుడు ఎకరానికి రూ. 20 వేల పంట రుణం ఇచ్చిన వాళ్లు ఇప్పుడు ఎకరానికి రూ. 60 వేలకు పైగా పంట రుణాలు ఇస్తున్నారు. రైతులపై బ్యాంకులకు నమ్మకం పెరిగింది.పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు తెలియజేయడానికి ప్రతి క్లస్టర్‌కు ఒక రైతు వేదిక నిర్మించారు. ఈ వేదికలో రైతులు సమావేశమై పంటల సాగు, మార్కెట్ విధానం తదితర అంశాలపై చర్చించుకుంటున్నారు.రైతు ఏ కారణంచేతనైనా చనిపోతే ఆకుటుంబానికి రైతు బీమా పథకం కింద రూ. 5లక్షల ను నేరుగా రైతునామిని బ్యాంకుఖాతాలోనే జమచేస్తున్నది.
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతన్నకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. స్వరాష్ట్రంలో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంట పెట్టుబడి, నాణ్యమైన విద్యుత్, పంట కొనుగోళ్లు ఇలా ఒకటేమిటి రైతుల అవసరాల మేరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. మాట తప్పేది లేదు..మడమ తిప్పేది లేదని తెలంగాణ ప్రభుత్వం రైతుల రుణమాఫీ విషయంలో చాటిచెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా రైతాంగానికి రుణమాఫీపై తీపి కబురు అందించారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.99,999 రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేశారు. ఇవ్వాళ ఎక్కడ చూసినా రైతున్నల రుణమాఫీ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. మరోవైపు రైతాంగంలో రుణమాఫీ సంబురం కనిపించింది. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌తోనే ఇలాంటివన్నీ సాధ్యమని కర్షకులు హర్షం వ్యక్తం చేశారు.
రైతుల మేలుకోరే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్. మాట ఇచ్చినట్లే రుణమాఫీ చేసి రైతుల పాలిట దేవుడయ్యాడు. రుణమాఫీ చేస్తానని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్‌పై మాకు పూర్తి భరోసా కలిగింది. నాకు రూ.85,113 రుణమాఫీ అయినట్లు ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. అదిచూడగానే చాలా సంతోషం కలిగింది. నాతోపాటు మా కుటుంబ సభ్యులైన ఇద్దరికి కూడా రుణమాఫీ అయినట్లు మెస్సేజులు వచ్చాయి. మా కుటుంబానికి మొత్తం రూ.1,69,244 రుణమాఫీ అయినట్లు మెస్సేజులు వచ్చాయి. దీంతో మాకు ఆర్థికభారం తగ్గింది. కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు,
ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– మాసుల దశరథ్, బ్రాహ్మణపల్లి, నర్సాపూర్
సిద్దిపేట అర్బన్, ఆగస్టు 16: సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి. రైతుల కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడని వ్యక్తి. అందుకే మాట ఇచ్చిన దానికంటే ముందుగానే రైతుల రుణాలను మాఫీ చేశారు. రైతుల కష్టం విలువ తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్ కనుకనే రైతుల కోసం నిరంతరం ఆలోచిస్తాడు. ఒక్కరోజే రూ.లక్ష రూపాయలలోపు ఉన్న రైతుల రుణాలను మాఫీ చేయడం గొప్ప విషయం. దేశంలోని ఏరాష్ట్రంలో చేయని విధంగా రైతులకు రెండుసార్లు రుణమాఫీ చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్. ఓవైపు రైతుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. రైతుల బాగు కోసం నిరంతరం తపిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు జిల్లా రైతుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. వచ్చే ఎన్నికల్లో రైతుల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉంటుంది. తప్పకుండా బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుంది.
– వంగ నాగిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు, సిద్దిపేట
అక్కన్నపేట, ఆగస్టు 16: సీఎం కేసీఆర్ మాట అంటే పక్కగా అమలు చేస్తాడు అని అనుకున్నా. నాకు రూ. 85 వేల రుణమాఫీ అయింది. హుస్నాబాద్‌లోని ఎస్బీఐకి వెళ్లి క్రాఫ్‌లోన్ అకౌంట్ చెక్ చేపిస్తే మాఫీ వచ్చిందని చెప్పడంతో సంతోషమైంది. నాలెక్క చాలా మంది రైతులు బ్యాంకులో పైసల్ పడ్డాయని తెలుసుకొని సంబురపడ్డారు. రుణమాఫీ కావడంతో తిరిగి మళ్లీ కొత్త రుణాలు కూడా తీసుకుంటున్నాం. బ్యాంకు అధికారులు రుణమాఫీ అయిన రైతులకు తిరిగి కొత్త రుణాలను వెంటనే మంజూరు చేస్తున్నారు. పేద రైతుల రుణాలు మాఫీ చేసి సీఎం కేసీఆర్ ఇంటికి పెద్ద దిక్కు అయిండు. సీఎం కేసీఆర్ నిండు నూరేండ్లు సల్లంగా ఉండాలి. మా రైతుల పక్షాన సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– బొడిగం సంజీవరెడ్డి, రైతు, అక్కన్నపేట
హుస్నాబాద్‌టౌన్, ఆగస్టు 16: రైతులు ఎవుసం చేసేది ప్రజల కోసమే. పది మందికి అన్నం పెట్టేందుకు బతుకుతున్నాం. మాలాంటి వాళ్లకు రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్‌కు దండం పెడుతు న్నాం. బ్యాంకులో రూ.40వేలు రుణం తీసుకున్నా. రుణం మాఫీ చేస్తనని సీఎం చెప్పినట్టే చేసిండు. రైతు బతుకుడే కాదు అందరినీ బతికిస్తడు. మాలాంటి రైతుల గోసచూసి ఆదుకున్న కేసీఆర్‌కే మా మద్దతు ఉంటుంది.
– గుడిపెల్లి రాజు, రైతు, హుస్నాబాద్
రామాయంపేట, ఆగస్టు 16: మా పేదోళ్లకు రుణమాఫీ చేసిన దేవుడు సీఎం కేసీఆర్‌సార్. ఆయనకే వచ్చే ఎలక్షన్లో ఓటేసి గెలిపించుకుంటాం. బ్యాంకులో రూ.70వేలు రుణం ఉంటే మొత్తం మాఫీ అయినయ్. మళ్లీ కేసీఆర్ సార్ తరఫున నిలబడి ఓటేపిస్తం. కాంగ్రెసొల్లను నమ్ముకుంటే తెలంగాణనే అమ్ముకుంటరు. జనమంతా కేసీఆర్‌కే జై కొడతరు.
– మధు, బచ్చరాజుపల్లి, రామాయంపేట
దుబ్బాక, అగస్టు 16: సీఎం కేసీఆర్ సారు ఇచ్చినమాటకు కట్టుబడి రైతులకు రుణాలు మాఫీ చేశారు. దుబ్బాక ఏపీజీవీబీలో రూ.95 వేలు మాఫీ అయిందని బ్యాంకు అధికారులు చెప్పారు. చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ సారు రైతులకు నిజమైన దేవుడు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సర్కారులో రైతులకు చాలా మంచిగా ఉన్నది. రైతుల కోసం సీఎం కేసీఆర్ సారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు ఉచిత విద్యుత్, పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి మంచి సౌలత్లు చేశారు. ఇప్పుడు రుణమాఫీ చేయడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నది. గతంలో ఏ ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించలేదు. రైతు సంక్షేమ కోసం కేసీఆర్ సారు మాత్రమే ఆలోచన చేస్తుండు, ఆ సారుకు రుణపడి ఉంటాం.
– పెంబర్తి శ్రీశైలం, లచ్చపేట గ్రామం, దుబ్బాక మండలం
కొమురవెల్లి ఏపీజీవీబీలో మా నాన్న మల్లయ్య రూ.90వేలు క్రాప్‌లోన్ తీసుకున్నాడు. తర్వాత కొంత కాలానికి ఆయన కాలం చేశాడు. క్రాఫ్ లోన్‌ను బ్యాంకు అధికారులు నా పేరు మీదికి మార్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రూణమాఫీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషం కలిగింది. మా నాన్న తీసుకున్న అప్పు మాఫీ అవుతుందో లేదో అనుకున్నా. బ్యాంకుకు వెళ్లి క్రాఫ్‌లోన్ చెక్ చేపించా.నాన్న తీసుకున్న రూ.90వేలతో పాటు రూ.9వేల మిత్తిని క్రాఫ్‌లోన్ అకౌంట్లో పడ్డాయని అధికారులు చెబితే చెప్పలేని ఆనందం కలిగింది. తండ్రి చేసిన అప్పు కొడుకు తీర్చాలి. కానీ మా నాన్న తీసుకున్న అప్పును సీఎం కేసీఆర్ తీర్చిండు. అన్న మాట ప్రకారం రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్‌పై మరింత అభిమానం పెరిగింది. సీఎం కేసీఆర్ సారు రుణం తీర్చుకోలేనిది.
– నీల మధుసూదన్, రైతు, గౌరాయపల్లి, కొమురవెల్లి మండలం
శివ్వంపేట, ఆగస్టు 16 : తనకున్న మూడెకరాల పొలంపై శివ్వంపేటలోని ఓ బ్యాంకులో క్రాప్‌లోన్ తీసుకున్న. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేసిండు. నాకు రూ.40 వేల రుణమాఫీ అయిం ది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకొని లోన్ మాఫీ చేసినందుకు రుణపడి ఉంటాం.
– లక్ష్మమ్మ, మహిళా రైతు, శివ్వంపేట
రామాయంపేట, ఆగస్టు 16: మనసున్న మారాజు కేసీఆర్ సారు.. మనకు అన్ని ఇస్తుండు. ఫించన్‌తోపాటు మనం బ్యాం కుల్లో తీసుకున్న అప్పులు కూడా మాఫి చేస్తుండు. ఎన్నో ఏండ్ల నాటి బాకీలను తీరుస్తుండు. ఆయనలాంటి మనిషి మనకు దొరకడు. అచ్చే ఎలచ్చన్లలో కేసీఆర్ సార్కే ఓట్లు ఎయ్యాలి లేకుంటే మనన్ని ఈ కాంగ్రెస్, బీజేపోళ్లు బతకనియరు. ఇప్పటికే కరెంట్ మూడేగంటలిస్తె సాలదా అని అంటుండ్రు. రేపు గిట్ల గాల్లు వస్తే మనకు అన్ని పెంచుతరు. బ్యాకులో అప్పు రూ.22వేలు ఉండె ఇప్పుడు అవన్ని మాఫీ అయినయ్. మాకు సంతోషంగా ఉంది.
– కమ్మరి సుజాత, నార్లాపూర్, రామాయంపేట
వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండుగ అనే పరిస్థితిని సీఎం కేసీఆర్ కల్పించారు. రైతుల కోసం అలోచించే ఇటువంటి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడ లేవు. రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చి మాటను నిలబెట్టకున్నారు. నేను వ్యవసాయం కోసం బ్యాంకులో తీసుకున్న రుణం రూ.లక్ష మాఫీ కానుంది. చాలా రోజులుగా ఎదురుచూస్తున్న రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్ ధైర్యం నింపారు.
– శౌకత్అల్లి, రైతు, హుస్సేలి ్ల(న్యాల్కల్ మండలం)
రైతులకు అండగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. రైతు రుణాలను మాఫీ చేసి మాట నిలబెట్టుకున్నారు. రుణమాఫి కింద నా బ్యాంకు ఖాతాలో రూ.98,736 నగదు జమకావడం సంతోషంగా ఉంది. ఎస్బీఐ బ్యాంకు నుంచి డబ్బులు జమైనట్లు వచ్చిన మేసేజ్ చూసి ఎంతో ఆనందపడ్డాను. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుంది. రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ చేయడంతో పాటు అధిక వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ నూరేండ్లు చల్లగా ఉండాలే…
– మన్నె అశోక్, రైతు (మక్త అల్లూర్ గ్రామం, కంది మండలం)
కొల్చారం, ఆగస్టు16: రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన దేవుడు. మాఫీ డబ్బులు ఈ రోజే నా బ్యాంకు అకౌంట్లో పడ్డాయి. రైతులను రాజు చేయాలనే అన్ని విధాలుగా ఆదుకుంటుండు. పంట పెట్టుబడి సాయం, రైతుబీమా, ఇరవైనాలుగు గంటల విద్యుత్ సరఫరా, సాగునీటి కోసం ఎన్నో ప్రాజెక్టులు కడుతూ రైతులను ఆదుకుంటున్ దేవుడు సీఎం కేసీఆర్ సార్. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయగల నాయకత్వం ఒక్క కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. ఆయన మళ్లీ వస్తేనే రైతులకు మేలు జరుగుతుంది.
– ఉసికె రాజు, రంగంపేట గ్రామ రైతు, కొల్చారం మండలం
సీఎం కేసీఆర్ సార్ ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్షలోపు మాఫీ చేస్తున్నట్టు నిర్ణయించడంతో రైతులందరూ ఎంతో సంతోషంగా ఉన్నరు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు సంక్షేమానికి సీఎం సార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రైతు కల నెరవేరింది. బ్యాంకు తీసుకున్న రూ.65 వేల రుణం మాఫీ కానుంది. రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు.
– బోయిని అంజన్న, రైతు, హద్నూర్ (న్యాల్కల్ మండలం)
వర్గల్, ఆగస్టు 16: గతంలో విద్యుత్ కోసం బావులకాడ కండ్లనిండా ఒత్తులేసుకొని ఎదురుచూసినం. దున్నిన దొయ్య పండుతదా? ఎండుతదా? అనుకొని బిక్కుబిక్కుమంటూ కాలంవెళ్లదీశాం. పండినపంట కొనేవాడులేక దళారులకు విక్రయించేది. బ్యాంకుల్లో అప్పులు చేసి లాగోడి తెచ్చుకున్నాం. కాంగ్రెస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పారే తప్పా రైతుల గోస వట్టించుకోలేదు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో లీడర్ బతికిండు, వాళ్లక్యాడర్ బతికిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. సీఎం కేసీఆర్ పాలనలో ఒక్కరుకాదు, ఇద్దరుకాదు సబ్బండ వర్గాలు బతుకుతున్నాయి. రైతులకు రుణమాఫీ చేస్తున్నారు అనగానే పంట ముందే చేతికొచ్చినంత సంతోషం అనిపించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సారు వల్ల కొండపోచమ్మ ప్రాజెక్టు కట్టించారు. బోరుబావుల్లో భూగర్భ జలాలు పెరిగాయి. ఇయ్యాల బుక్కెడు బువ్వ కడుపునిండా తింటున్నాం. బ్యాంకులో లక్ష అప్పు తీసుకున్నా. ఫోన్లో రుణమాఫీ అయిందని మెసేజ్ వచ్చింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధర, సమయానికి ఎరువులు ఇవ్వడం, ప్రాజెక్టులు కట్టడం, రైతుబంధు, రైతుబీమా, రైతు రుణమాఫీ ఇలా మా లాంటి పేద రైతులకు మంచిపని చేసిన సీఎం కేసీఆర్ సారుకు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలె.
– లింగకిష్టయ్య, రైతు,నెంటూర్ గ్రామం, వర్గల్ మండలం, సిద్దిపేట జిల్లా
హుస్నాబాద్‌రూరల్, ఆగస్టు16 : ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయడం ఆనందంగా ఉన్నది. నాకు రెండు ఎకరాల 8గుంటల భూమి ఉన్నది. బ్యాంకులో రుణం తీసుకున్నా. ప్రభుత్వం రూ. 81వేలు రుణమాఫీ చేయడం సంతోషంగా ఉన్నది. మళ్లీ రూ.80వేల వరకు కొత్తగా రుణాలు ఇస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. మా లాంటి పేద రైతులకు రుణమాఫీ కొండంత ఆసరా అయింది. ఇటీవల రైతుబంధు పడింది. మళ్లీ ఇప్పుడు రుణమాఫీ కావడంతో రైతులకు ఊరట కలిగింది. అన్న మాట ప్రకారం రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– వేల్పుల రాజయ్య, రైతు, మీర్జాపూర్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు రైతుల పాలిట దేవుడు. తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకొచ్చి రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. కరోనా లాంటి ఎన్నికష్టాలు వచ్చినా బయపడలేదు. రైతులను ఆదుకుంటున్నాడు. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలే. నాకు రూ.89వేలు మాఫీ అయింది.ప్రాజెక్టులు, చెక్‌డ్యామ్‌లు కట్టించి సాగునీరు అందిస్తున్నారు.
– గోవిందు రమేశ్, రైతు, కోహెడ
ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ రూ.లక్షలోపు వరకు రణమాఫీ చేశారు. బ్యాంక్‌లో రూ. 50వేలు మాఫీ అయినట్లు మెసేజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్‌కు రైతుల కష్టాలు తెలుసు కాబట్టే కర్షకులకు మేలు చేసే పనులు చేస్తున్నాడు. రుణమాఫీ చేసిన సీఎం కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారు.
– తిరుపతి, రైతు, ధూళిమిట్ట
నిన్నమొన్నటి వరకు రుణమాఫీ అయితదో లేదో అనే అనుమానం ఉండే. కానీ రూ.లక్షలోపు రుణమాఫీ అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నది. గింతమంచిగా రైతులకు సౌల త్ చేసిన సీఎంను నేనైతే చూడలేదు. రైతులకు మేలు చేసే పనులు చేస్తున్న సీఎం కేసీఆర్ వెంటే రైతులంతా ఉంటారు. రణమాఫీ చేసిన సీఎం కేసీఆర్ సారుకు ధన్యవాదాలు.
– నర్సింహులు, రైతు, రేబర్తి, మద్దూరు మండలం