వెల్దుర్తి, సెప్టెంబర్ 12: కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి వెల్దు ర్తి మండలం వ్యాప్తంగా చెరువులు, కుంటలు, చెక్ డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాటిలో ఉన్న చేపలు అలుగు లు, మత్తడుల వద్ద కొట్టుకోస్తున్నాయి. వెల్దుర్తి, ఉప్పులింగాపూర్ శివారులోని హాల్దీ వాగుపై ఉన్న చెక్‌డ్యాంలతో పాటు వెల్దుర్తి దేవతల చెరువు వద్ద చేపలు పడుతున్నారు.
మనోహరాబాద్, సెప్టెంబర్ 12: మనోహరాబాద్ మండలంలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల్లో చెరువుల వద్ద ప్రజాప్రతినిధులు, ముదిరాజ్ సం ఘ సభ్యులు పూజలు నిర్వహిస్తున్నారు. దండుపల్లి మద్దెల చెరువు 30ఏండ్ల తర్వాత నిండిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో సోమవారం ముదిరాజ్ సంఘం, పాలకవర్గం ఆధ్వర్యంలో కట్టపై వెలిసిన వెంకమ్మ ఆలయంలో ప్రత్యేక పూజ లు నిర్వహించి, గం గమ్మకు హారతి, పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లతావెంకట్గౌడ్, సర్పంచ్ పంజా లక్ష్మీ ముదిరాజ్, ఉప సర్పంచ్ మహేందర్‌గౌడ్, ముదిరాజ్ సం ఘం నాయకుడు పంజా భిక్షపతి పాల్గొన్నారు.
రామాయంపేట, సెప్టెంబర్ 12: మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో రామాయంపేట, నిజాంపేట, నా ర్సింగి మండలాల్లోని చెరువులన్నీ జలమయమయ్యాయి. గ్రామస్తులు చెరువుల వద్దకు చేరుకుని సెల్ఫీలు దిగుతూ సరదగా గడుపుతున్నారు.
నర్సాపూర్,సెప్టెంబర్12: మండలంలోని ఆయా గ్రామా ల్లో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు జలకలను సం తరించుకున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల మారి కనువిందు కలిగిస్తున్నాయి. అలుగులు పారడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.