మెదక్ రూరల్, సెప్టెంబర్ 8 : ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనం పూర్తి చేయాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీఎస్పీ సైదులు కోరారు. మెదక్ మండలం లోని కొంటూరు చెరువులో ఏర్పాటు చేస్తున్న పనులను గురు వారం మున్సిపాల్ కమిషనర్ శ్రీహరి, చైర్మన్ చంద్రపాల్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ పట్టణంతోపాటు మండలంలోని వినాయకులను కొంటూరు చెరువులో నిమజ్జనం చేయాలన్నారు. నిమజ్జ నాలు పూర్తయ్యేవరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువు కట్టలపై లైటింగ్ కోసం నిరాంతరాయం గా విద్యుత్‌ను సరఫరా చేయాలని విద్యుత్‌శాఖ అధికారులను కోరారు. చెరువులు, కుంటలు నిండుగా ఉన్నందున బారికేడ్ల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన చోట్ల క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటు ఉంచుతున్నట్లు వివరించారు.
11లోగా నిమజ్జనాలు పూర్తి చేయాలి: రామాయంపేట మున్సిపల్ చైర్మన్, సీఐ, ఎస్సై
వినాయక నిమజ్జనాలను రామాయంపేట మండలంలో 11వ తేదీలోగా పూర్తి చేయాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, కమిషనర్ ఉమాదేవి, సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంతోపాటు వివిధ ప్రాంతాల్లోని చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. రామాయంపేటలోని హనుమ, కొచ్చెరువు, సర్వాయికుంట చెరువుల స్థలాన్ని జేసీబీల ద్వారా చదును చేయిస్తున్నారు. 11వ తేదీ వినాయక నిమజ్జనాలు పూర్తి చేసేలా ప్రణాళికను రూపొందించామన్నారు. నిమజ్జనాలు ముగిసే వరకు పోలీస్ సిబ్బంది, మున్సిపల్, పారిశుధ్య సిబ్బంది నిత్యం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాళ్లకల్‌లో వినాయక నిమజ్జనాలు
మండలంలని కాళ్లకల్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం చూపరులను ఆకట్టుకుంది. గుర్రపు బండ్లు, లైటింగ్, కోలాటలు, ఆట, పాటలతో యువత సందడి చేస్తూ వినాయక విగ్రహాన్ని కాళ్లకల్ చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కాళిదాస్ పాల్గొన్నారు.
సామూహికంగా తరలిన గణనాథులు
మండల పరిధిలోని రుస్తుంపేట్ గ్రామంలో గణనాథులను సామూహికంగా నిమజ్జనానికి తర లించారు. గ్రామంలో ప్రతిష్ఠించిన గణనాథుల నిమజ్జన కార్యక్రమం ఒకేరోజు నిర్వహిస్తారు. 15 ఏండ్ల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. నర్సాపూర్ సీఐ షేక్‌లాల్ మధార్, ఎస్సై గంగరాజు పోలీస్ సిబ్బందితో బందోబస్త్తు నిర్వహించా రు. కార్యక్రమంలో సర్పంచ్ విజయ్‌భాస్కర్, ఎంపీటీసీ లక్ష్మీఅశోక్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ శివకుమార్ పాల్గొన్నారు.