ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ లక్ష్మారెడ్డి
చిన్నశంకరంపేట, సెప్టెంబర్ 6 : దేశంలో ఎక్కడాలేని విధంగా టీఆర్ఎస్ సర్కారు పాల ధరను పెంచి, పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సహిస్తున్నదని మెదక్ ఉమ్మడి జిల్లా పశుగణాభివృద్ధి చైర్మన్ లక్ష్మారెడ్డి తెలిపారు. మంగళవారం మండలంలోని జంగరాయిలు సర్పంచ్ జ్యోతి ఆధ్వర్యంలో గర్భవ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి ఆవు పాలకు రూ.5, గేదె పాలకు రూ.2.75పైసలు పెంచిందన్నారు. పాడి రైతులు తమ పాలను విజయ డైయిరీలో విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పశుగణాభివృద్ధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆడ దూడలు జన్మించేందుకు రూ.675 ఖర్చవుతున్నదన్నారు. ‘సెక్సెస్ సేమన్’ కార్యక్రమం ద్వారా పాడి రైతులకు రూ.475 రాయితీని అందిస్తున్నదన్నారు. మిగతా రూ.250 విజయ డెయిరీ చెల్లించేందుకు ఆలోచిస్తున్నదని తెలిపారు. ప్రతి రైతు వ్యవసాయంతో పాటు పాడి అభివృద్ధిని పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏడీ డాక్టర్ రాంజి, పశువైద్యాధికారులు శ్రీనివాస్, రాజు, టీఆర్ఎస్ నాయకులు ప్రభాకర్, సురేశ్, దుర్గాగోపాలమిత్ర సూపర్వైజర్లు సత్యనారాయణ, రమేశ్, నవీన్, రేణుక పాల్గొన్నారు.