జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య
తూప్రాన్ మున్సిపాలిటీలో పశు వైద్యశిబిరం
తూప్రాన్/ నిజాంపేట, సెప్టెంబర్ 6 : తూప్రాన్ మున్సిపల్లోని పడాలపల్లి ప్రాథమిక పశు వైద్యకేంద్రంలో మంగళవారం ఉచిత పశు వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జీవాలకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు, మూతి పుండ్లు, కాలి కుం ట్లు, జ్వరం, న్యుమోనియా, జీర్ణకోశ సంబంధిత వ్యాధుల నివారణకు మందులతో పాటు పారుడు వ్యాధి నివారణ టీకాల ను యజమానులకు అందజేశారు. ఆవులు, ఎద్దులకు లంపి స్కిన్ అనే వ్యాధి ప్రబలుతున్నదని, ఈ వ్యాధి అంటువ్యాధి అని, చర్మం పై తీవ్ర దద్దుర్లు ఏర్పడి అస్వస్థతకు గురై పశువులు మరణిస్తాయని వివరించారు. పశువులు, జీవాల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మంగళవారం 1700 జీవాలకు పారుడు వ్యాధి నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అరుణావెంకట్గౌడ్, గొర్లకాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ మల్లేశ్ యాదవ్, జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ సుదర్శన్ పాణి, వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ లింగమూర్తి, ఓఎస్ మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
గొర్రెలు, మేకలకు టీకాలు వేయించాలి
నిజాంపేట మండలం నార్లపూర్‌లో వెటర్నరీ అధికారి సుధాకర్ దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో మేకలు, గొర్రెలకు టీకాలు వేశారు. ఈ సం దర్భంగా జీవాలకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ చర్యలను యా జమానులకు వివరించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంజీవ్, కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జూనియర్ వెటర్నరీ అధికారి కిషన్‌బాబు, గోపాలమిత్ర స్వామి, జీవాల యజమానులు పాల్గొన్నారు.