మెదక్ మున్సిపాలిటీ/ పెద్దశంకరంపేట/ పాపన్నపేట/ చేగుంట, సెప్టెంబర్ 6 : జిల్లా కేంద్రం మెదక్‌లో గణనాథులు నిత్యం పూజలందుకుంటున్నాయి. మంగళవారం జంబికుంటలోని సూర్య గణేశ్ మండపం వద్ద హోమం నిర్వహించారు. హోమంలో ఏడుపాయల దేవస్థాన డైరెక్టర్ చక్రపాణి, కౌన్సిలర్ అశోక్‌తోపాటు పలువురు దంపతులు పాల్గొన్నారు. ము న్సిపల్ చైర్మన్ గణనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గణేశ్ మండపాల వద్ద అన్నదానాలు చేశారు.
పెద్దశంకరంపేట పట్టణంలోని తిర్మలాపురం కాలనీలో సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చన చేశారు. ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాపన్నపేటలో హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యం లో అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో దాత కడారి ప్రభు, సర్పంచ్ గురుమూర్తిగౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
చేగుంటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో కుం కుమార్చన నిర్వహించారు. సీఎంఆర్ కాలనీలో నాయకులతో కలిసి సర్పంచ్ శ్రీనివాస్ అన్నదానాన్ని ప్రారంభించారు.