టేక్మాల్, సెప్టెంబర్ 3 : మా పార్టీ వారికే పింఛన్లు ఇస్తాం.. ఇతర పార్టీ వారికి ఇవ్వం.. అనే ఆలోచన గత ప్రభుత్వాలకు ఉండేదని.. పార్టీలకతీతంగా పింఛన్లు ఇస్తున్న ఘనత కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పేర్కొన్నారు. శనివారం టేక్మాల్ మండలకేంద్రంలో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను అందజే శారు. స్థానిక రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామన్నారు. ప్రజలు తమ కుటుంబాలతో సంతోషంగా ఉండాలని, అభివృద్ధ్ధి చెందాలని ఆలోచించే వా రిలో సీఎం కేసీఆర్ అందరి కంటే ముందుంటారని అన్నారు. మేము రైతులకు ఏ మేలు చేస్తున్నామో? ప్రస్తుత తెలంగాణ పరిస్థితులు నిదర్శనమన్నారు. రైతుబంధు ప్రారంభమైన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గి, ఎవరి దగ్గర కూడా అప్పుచేసే పరిస్థితి లేదన్నారు. గతంలో రూ.200 ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2016 పింఛన్ ఇచ్చి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు భరోసా కల్పిస్తుందన్నారు. కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ రేషన్ బియ్యం పంపిణీపై రాజకీయం చేశారని విమర్శించారు. పేదలకు కడుపు నింపే బియ్యం పంపిణీలో వాటాల శాతం గురించి అడగడం ఆశ్చర్యకర విషయమన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం అబద్దాలు చెపుతుందని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఓటు రూపంలో తగిన సమాధానం చెపుతారని హెచ్చరించారు. పింఛన్ల మం జూరు పత్రాల పంపిణీ అనంతరం పలువురి లబ్ధిదారులకు దళితబంధు యూనిట్లను ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ అంద జేశారు. లబ్ధిదారులు దళితబంధు యూనిట్లను సద్వినియో గం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సూచిం చారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మి, జిల్లా కోఆప్షన్ సభ్యు డు యూసూఫ్, ఎంపీపీ చింత స్వప్న, వైస్ ఎంపీపీ మంజుల, ఎంపీటీసీలు వాణి, నారాయణరెడ్డి, సురేందర్‌రెడ్డి, మోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ఉపాధ్యక్షుడు తలారి అవినాశ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గ్రామాల్లో పింఛన్ల్ల సంబురం
పింఛన్లు పంపిణీ చేయడంతో లబ్ధి దారులు సంబురపడుతున్నారు. చేగుంట మండలంలోని చందాయిపేట, చెట్లతిమ్మాయిపల్లి, నార్సింగి మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు లబ్ధిదారులకు పిం ఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ సార్ సల్లగుండ.. పెద్ద కొడుకు లెక్క పెన్షన్ ఇస్తుండు అంటూ వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో నార్సింగి ఎంపీపీ చిందం సబిత, వైస్ ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ బండారి సంతోష, సర్పంచ్‌లు మల్లేశం, స్వర్ణలత, మోహన్, నాయకులు మైలరాం బాబు, బుడ్డ భాగ్యరాజ్, సంతోశ్‌కుమార్ పాల్గొన్నారు.
నేడు పింఛన్ల పంపిణీ
హాజరుకానున్న ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి
వెల్దుర్తి మం డలంలోని మానేపల్లి, అందుగులపల్లి గ్రామాల్లో ఆదివారం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పింఛన్లు పంపిణీ చేస్తున్నారని ఎంపీపీ స్వరూప శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం మానేపల్లిలో పింఛన్లు అందజేస్తారని, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే కార్యక్రమానికి రావాలని కోరారు.
పెద్దశంకరంపేట పట్టణంలోని బాయికాడి పద్మయ్య ఫంక్షన్హాల్లో ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను లబ్ధ్దిదారులకు నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అందజే స్తారని ఎంపీపీ జంగం శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీపంతులు తెలిపారు. పెద్దశంకరంపేట మండలానికి 1080 పింఛన్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.