మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 29 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెడుతూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలుపుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ మున్సిపాలిటీ పరిధి, మండలంలోని మాక్తభూపతిపూర్, హవేళీఘనపూర్ల్లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను ఆమె లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు రూ.200 పింఛన్ ఇచ్చే వారిని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రూ.2016కు పెంచామని, వయోపరిమితిని 65 నుంచి 57 ఏండ్లకు తగ్గించామని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు అందరూ అండగా నిలువాలని పేర్కొన్నారు.
పేదల సం క్షేమానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అర్హులైన వారికి అందేలా కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవా రం జిల్లా కేంద్రంలోని ద్వారకా గార్డెన్లో 1247 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్ రూ.2016 అందజేస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం, ఇంటింటికీ భగీరథ నీరు, రైతుబంధు, రైతుబీమా పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. 65 ఏండ్ల వయో పరిమితి 57కు తగ్గించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగిందన్నారు.
గత ప్రభుత్వాలు రూ. 200 పింఛన్ ఇచ్చాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.2,016కు పెంచినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు మీ దీవెనలు ఎల్లవేళలా ఉండాలన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ దొంతి లక్ష్మి ఆధ్వర్యంలో పద్మాదేవేందర్‌రెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చం ద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గాడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, మామిళ్ల ఆం జనేయులు, జయరాజ్, కిశోర్, ఆర్కే శ్రీనివాస్, వసంత్, లింగం, సుంకయ్య, లక్ష్మీనారాయణగౌడ్, శేఖర్, గాయత్రి, సులోచన, బట్టి లలిత, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, ముత్యంగౌడ్, చింతల నర్సింహులు, శ్రీధర్‌యాదవ్, మేడి మధుసూదన్, దుర్గాప్రసాద్, సుమన్, నగేశ్, రుక్మల్చారి పాల్గొన్నారు.
మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
మెదక్ రూరల్, ఆగస్టు 29 : దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ పెన్షన్లు మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నా రు. మండలంలోని మాక్తభూపతిపూర్ మున్నూ రు కాపు ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సోమవారం 829 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్ మం జూరు పత్రాలు అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్న ఘన త సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జిల్లాలో 21వేల మందికి పింఛన్లు మంజూరయ్యాయని వెల్లడించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ అంజాగౌడ్, ఎం పీపీ యమునాజయరాంరెడ్డి, వైస్ ఎంపీపీ ఆంజనేయులు, మెదక్, మాచవరవ పీఏసీఎస్ చైర్మన్లు చిలుముల హన్మంత్‌రెడ్డి, సీతారామ య్య, రైతుబంధు మండల అధ్యక్షుడు కిష్టయ్య, ఎంపీడీవో శ్రీరాములు, ఎంపీవో ప్రశాంత్, మం డల వ్యవసాయాధికారి శ్రీనివాస్, ఆత్మకమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, ఎంపీటీసీలు ప్రభాకర్, మా నస, శ్రీహరి, సర్పంచ్‌లు వికాస్, నర్సింహులు, సిద్ధగౌడ్, ప్రభాకర్, వెంకటేశం, సరోజామోహన్, రజినీ భిక్షపతి, జానకీరాంరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, టీఆర్ఎస్ నాయకులు, వార్డుసభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమానికి పెద్దపీట
హవేళీఘనపూర్, ఆగస్టు 29 : సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవా రం మండల కేంద్రం హవేళీఘనపూర్ గార్డెన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి, 1231 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే పింఛన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరుతో పాటు ఎన్నో ఏండ్లుగా మిగిలిపోయిన రైల్వేలైన్ పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, ఎంపీడీవో శ్రీరామ్, ఇన్చార్జి తహసీల్దార్ నవీన్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఖాలేద్, పీఎసీఎస్ డైరెక్టర్ సాప సాయిలు, సర్పంచ్‌లు సవిత, మహిపాల్‌రెడ్డి, యామిరెడ్డి, చెన్నాగౌడ్, లింగం, మంద శ్రీహరి, దేవాగౌడ్, లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు మేకల సాయిలు, నరేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, గణపతి, బయ్య న్న పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ సార్ చల్లగుండాలె
సీఎం కేసీఆర్ సార్ చల్లగుండాలె. రాబో యే రోజుల్లో మా బతుకుల్లో మరింత బాగుపడేలా చూడాలె. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న పనులు చాలా బాగున్నాయి. పెన్షన్ వచ్చిందన్న విషయాన్ని చెప్పగానే ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
–నందాల బాలమ్మ, హవేళీఘనపూర్
సీఎం కేసీఆర్ వృద్ధులకు పెద్దకొడుకు
60 ఏండ్లకు ఇచ్చే ఆసరా పిం ఛన్లు 57 ఏండ్లకు తగ్గించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. గత ప్ర భుత్వాలు ఎన్నడూ ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్ ఆసరా పిం ఛన్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 200 పింఛన్ ఇవ్వడంతో మందు గోళీలు కూడా రాలేవు. టీఆర్ఎస్ హయాంలో రూ. 2016 పెంచి వృద్ధులను పెద్ద కొడుకులాగా ఆదుకుంటున్నాడు.
–గణేశ్, మల్కాపూర్ తండా, మెదక్