సంగారెడ్డి, ఆగస్టు 29 : హాకీ మాంత్రికుడు, దిగ్గజం ధ్యాన్‌చంద్ అని, ఆయన క్రీడాస్ఫూర్తితో క్రీడాకారులు హాకీలో రాణించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సోమవా రం ధ్యాన్‌చంద్ జయంతిని స్థానిక అంబేద్కర్ మైదానంలో జిల్లా యువజన క్రీడల అధికారి జావీద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చింతా ప్రభాకర్ హాజరయ్యారు. జాతీయ క్రీడల దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హాకీ, 800 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, షార్ట్‌పుట్, జావెలిన్‌త్రో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించి తెలంగాణ కీర్తి ప్రతిష్టలు చాటిచెప్పాలని కోరారు. కార్యక్రమంలో కోచ్‌లు దేవిక, శ్రీనివాస్, షరీఫ్, సాయికుమార్, అరవింద్, సీడీసీ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్‌రెడ్డి, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జలేందర్, క్రీడాకారులు పాల్గొన్నారు.