సిద్దిపేట అర్బన్, ఆగస్టు 28 : జిల్లాలో కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష సాఫీగా జరిగింది. జిల్లా కేంద్రంలోని 24 ప్రాంతాల్లోని 30 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరిగింది. మొత్తం 13,890 మంది అభ్యర్థులకు 13, 075 మంది హాజరు కాగా 94.13 శాతం హాజరు నమోదైంది. పలు కేంద్రాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత సందర్శించి పరీక్ష జరిగే తీరును పరిశీలించారు. పరీక్షా సమయం ముగిసిన తర్వాత వచ్చిన ఆరుగురు అభ్యర్థులను అధికారులు పరీక్షకు అనుమతి నిరాకరించారు.
జిల్లా కేంద్రంలోని 24 ప్రాంతాల్లోని 30 పరీక్షా కేంద్రాల్లో జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షకు 13,890 మంది అభ్యర్థులకు 13,075 మంది హాజరు కాగా 815 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 9,656 మంది పురుష అభ్యర్థులు ఉం డగా 3,419 మంది మహిళా అభ్యర్థులు ఉన్నా రు. గైర్హాజరైన వారిలో 526 మంది పురుష అభ్యర్థులు, 289 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. దీంతో పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేందుకు కృషి చేసిన జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ వీపీ రాజు, పోలీస్ పరీక్షల నోడల్ అధికారి అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, చీఫ్ సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్ అధికారులు, సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బందిని సీపీ శ్వేత అభినందించారు.