సిటీబ్యూరో, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ ) : పెరిగిన సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ధరలతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. సరిపడా సరఫరా లేకపోవడంతో కిలో సీఎన్జీ రూ.94కి చేరింది. కొద్ది రో జుల క్రితం రూ.85 ఉండేది. గత నెల రూ.92కు చేరింది. నేడు మరో రెండు రూపాయలు పెరిగి రూ.100కు దగ్గరవుతున్నది. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంగా వాహనదారులు సీఎన్జీ వినియోగానికి మళ్లితే.. పెరిగిన సీఎన్జీ ధరలతో మళ్లీ వెనక్కివెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్జీ, గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ కు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్ జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలో ఇంధనానికి 22 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. దీంతో వీటి ధర పెరిగినా డిమాండ్ ఏమాత్రం తగ్గడంలేదు. ఫలితంగా నో స్టాక్ బోర్డులతో బంక్‌లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం మారెట్లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, సీఎన్జీ, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు వేర్వేరుగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 460 పైగా పె ట్రోల్ బంకులు ఉండగా, 72 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి.
దర్శనమిస్తున్న నోగ్యాస్ బోర్డులు..!!
పెట్రోల్‌తో నడిచే వాహనాలు సీఎన్జీ కిట్ ఉన్నా ప్రత్యామ్నాయంగా పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. అదే డీజిల్‌కు ఈ సదుపాయం లేదు. ఒక్కో కిట్ కోసం వాహనదారులు రూ.20వేల నుంచి రూ.40 వేల దాకా ఖర్చు అవుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో సీఎన్ జీ బంకులకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్(బీజీఎల్) కం పెనీ గ్యాస్ సరఫరా చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఒక్క ఆటోలో 4 కిలోలు, కారులో 9 కిలోల సీఎన్జీ ఇం ధనం నింపొచ్చు. కిలోకు 30 కిలోమీటర్లు లెక్కెస్తే ఒక్కో ఆటోకు రోజులో ఫుల్ట్యాంక్ అయిపోతుంది. ఒక్కో బం కుల్లో 2వేల కిలోల వరకు అమ్ముతున్నారు. వచ్చిన కాసేపటికే గ్యాస్ అయిపోతుండడంతో వాహనాలు క్యూ కడుతున్నాయి. మహా నగరంలో సుమారు 3 నుంచి 4 లక్షల వాహనాలు సీఎన్జీ, ఆటో గ్యాస్, లిక్విడ్, ఎల్పీజీ గ్యాస్ ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్‌కు కొరత లేనప్పటకీ సీఎన్జీ పూర్తిస్థాయిలో సరఫ రా లేదు. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజూ 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది.
నాలుగు గంటల్లోనే గ్యాస్ ఖాళీ
ఒక్కో ఇంధన స్టేషన్‌కు రోజుకి సుమారు పదిలోడ్లు గ్యాస్ అవసరం పడుతుంది. కానీ, వస్తున్నది.. రెండు, మూడు లోడ్లు మాత్రమే. ఐదారు నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. బంకుల్లో ఇంధనం నింపిన నాలుగైదు గంటల్లోనే గ్యాస్ అయిపోయిందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో 72 సీఎన్జీ స్టేషన్లు ఉన్నాయి. రాష్ర్టానికి కాకినాడ బేసిన్ నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది. కొన్నాళ్లు సప్లయిలో అంతరాయం ఏర్పడిందని బంక్ నిర్వాహకులు చెప్పారు. ఇంధనం లేకపోవడంతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నోస్టాక్ బోర్డులు కూడా పెట్ట డం లేదు. వాహనాలు బంక్‌ల ఎదుట భారీగా బారులు తీరినా ఫలితం ఉండటం లేదు. – సత్తిరెడ్డి, వాహన సంఘాల నాయకుడు
ప్రతి రోజూ ఇంధన ధరలు పెంచుతున్న కేంద్రం
సీఎన్జీ బండ్లు తగ్గిపోయి మళ్లీ పెట్రోల్, డీజిల్ వాహనాలు పెరిగే పరిస్థితి వచ్చే ప్రమా దం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రతిరోజూ ఇంధన ధరలను పెంచుకుంటూ పోతున్నది. కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా సీఎన్జీ వాహనాల వినియో గం పెంచాల్సిన అవసరం ఉంది. కానీ అధికంగా డబ్బులు వసూలు చేస్తే డ్రైవర్లకు గిట్టుబాటు కాదు. కొన్ని బంకుల్లో కిలోకు 5 రూపాయలు అదనంగా తీసుకుంటున్నారు. ఇంకో రూ.10 ఖర్చు చేస్తే పెట్రోల్ వస్తుందనే భావన ఏర్పడుతోంది.
– వేముల మారయ్య, రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు