పెద్దశంకరంపేట/ అల్లాదుర్గం/ పాపన్నపేట/ శివ్వంపేట/ వెల్దుర్తి/ చేగుంట, ఆగస్టు 26 : శాంతియుత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించాలని అల్లాదుర్గం సీఐ జార్జి పేర్కొ న్నారు. శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పట్టణానికి చెందిన మతపెద్దలు, ప్రజాప్రతినిధులు, గణేశ్ ఉత్సవాల నిర్వాహకు లతో శాంతి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఐ మాట్లాడారు. ఈ నెల 31న వినాయక చవితి పురస్కరించుకొని తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. నవరాత్రులు ముగిసే వరకు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలను పూర్తి చేయాలన్నారు. గణేశ్ ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. వినాయక మండపాల ఏర్పా టుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.
ఉత్సవాల పేరుతో ఇతరులు ఇబ్బంది పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద ఇద్దరు వలంటీర్లు తప్పనిసరిగా ఉం డాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సుప్రీంకోర్టు గైడ్లెన్స్ ప్రకారం మండలపాల వద్ద, ఊరేగింపు సమయంలో డీజేలకు అనుమతి లేదన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతోపాటు కేసులు నమోదు చేస్తామన్నారు. సమావేశంలో తహసీల్దార్ చరణ్, సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు మురళీపంతులు, ఎస్సై బాలరాజు ఉన్నారు.
అల్లాదుర్గం పోలీస్‌స్టేషన్‌లో సీఐ జార్జి ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, ఎస్సై ప్రవీణ్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించాలి…
ప్రజలు వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వ హించుకోవాలని ఎస్సై విజయ్‌కుమార్ సూచించారు. పాపన్నపేటలోని ఫంక్షన్హాల్లో సమావేశం నిర్వహించారు. పోలీసు శాఖ అనుమతి తర్వాతనే గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించాలని సూచించారు. ప్రజలంతా సమన్వయంతో ఉండాలన్నారు. వినాయక మండపాల వద్ద విద్యుత్ వైర్లు ఉన్నచోట జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సమావేశంలో సర్పంచ్‌లు ప్రభాకర్‌రెడ్డి, లింగారెడ్డి, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నేతలు బాబాగౌడ్, అనిల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
డీజేలకు అనుమతి లేదు… పెడితే చర్యలు తప్పవు
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని.. పెడితే చర్యలు తప్పవని తూప్రాన్ సీఐ శ్రీధర్ హెచ్చరించారు. వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై మధుసూదన్‌గౌడ్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆధ్యాత్మిక భావన, భక్తిశ్రద్ధలతో, స్నేహభావంతో ఉత్సవాలు నిర్వహించాలన్నారు. భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, దవాఖానలు ఉన్న ప్రాం తాల్లో మైకులను ఏర్పాటు చేయవద్దన్నారు. మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంటుంద న్నా రు. పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, సర్పంచ్‌లు శేఖర్, భూమయ్య, భాస్కర్‌రెడ్డి, మల్లేశంగౌడ్, నారాయణ, విఠల్, ఎంపీటీసీలు బాబు, అడివయ్య, నాయకులు నరేందర్‌రెడ్డి, కృష్ణ, బాల్‌రెడ్డి, శేఖర్‌గౌడ్, మహేశ్‌రెడ్డి, దుర్గాగౌడ్, మైసయ్య, యూత్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
– మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
పోలీసుల అనుమతి తీసుకుని వినాయకులను ప్రతిష్ఠించాలని శివ్వంపేట ఎస్సై రవికాంత్‌రావు అన్నారు. శాంతి కమిటీ సమావేశంలో ఏఎస్సై విఠల్, హెడ్‌కానిస్టేబుల్ దాసు, నాయ కులు వెంకటయ్య, జానీ, వినాయక నిర్వాహకులు ఉన్నారు.
పోలీసుల సూచనలు పాటించాలి
వినాయక ఉత్సవాల్లో పోలీసుల సూచనలు పాటించాలని చేగుంట తహసీల్దార్ లక్ష్మణ్‌బాబు, ఎస్సై ప్రకాశ్‌గౌడ్ సూచిం చారు. చేగుంట పోలీస్‌స్టేషన్ ఆవరణలో సమావేశం నిర్వహిం చారు. మండపాల ఏర్పాటుకు ఆన్లైన్లో పోలీసుల అనుమ తి పొందాలన్నారు. సూచించిన సమయంలో నిమజ్జనాలు చే యాలని, నిమజ్జనం సమయంలో ఎలాంటి ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శాంతి సమా వేశంలో ఎస్సై పోచయ్య, సర్పంచ్ మోహన్ పాల్గొన్నారు.