గజ్వేల్, ఆగస్టు 25 : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజిద్దామని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం గజ్వేల్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మట్టి గణపతుల ఆవశ్యకతను తెలిపే కరపత్రాలను మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, కౌన్సిలర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనాలు, రంగులు లేని మట్టి గణపతులను ప్రజలు పూజించాలన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులతో పర్యావరణానికి హాని కలుగుతుందని. ముఖ్యంగా చెరువులు కలుషితమై జలచరాలకు ప్రమాదం కలుగుతుందన్నారు. దీంతో మానవాళికి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అనంతరం సేవా సంస్థ నిర్వాహకులు నర్సింహులు మాట్లాడుతూ మట్టి గణపతులను ఏర్పాటు చేయడంతోపాటు మండపాల వద్ద మొక్కలు నాటేవారికి సంస్థ తరఫున ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు రహీం, ఉప్పల మెట్టయ్య, రజిత, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు రాజు, స్వామిచారి, సంస్థ ప్రజాప్రతినిధులు, నాగరాజుగౌడ్, గణేశ్, నరేశ్, నర్సింహులుగౌడ్, కుమార్, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గజ్వేల్, ఆగస్టు 27 : ఉచిత కుట్టు మిషన్ శిక్షణను మహిళలు సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి సూచించారు. గజ్వేల్ పట్టణంలో డీఆర్డీవో, యూనియన్ బ్యాంకు సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని వారు ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 55 మంది మహిళలు, యువతులు శిక్షణ ప్రారంభ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ శిక్షణకు హాజరయ్యే వారికి భోజన సదుపాయం ఏర్పా టు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, యూనియన్ బ్యాంకు ప్రతినిధులు రాజలింగం, అడిషనల్ డీఆర్డీవో కౌసల్యాదేవి, ఏపీడీ సతీశ్ పాల్గొన్నారు.
జగదేవ్‌పూర్, ఆగస్టు 25 : మండలంలోని నబీనగర్ గ్రామానికి చెందిన మంద సాయిలు గురువారం జగదేవ్‌పూర్ గ్రామంలో వీధి దీపాలు సరి చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, సర్పంచ్ల ఫోరం మం డల అధ్యక్షుడు నరేశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఎక్బాల్, ఎంపీటీసీ కవితాశ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.