జిన్నారం, ఆగస్టు 24: ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో కొత్త ఆలయాల నిర్మాణాలతో పాటు పురాతన ఆలయాలను జీర్ణోద్ధ్దారణ చేసి నూతనంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. మండలంలోని శివనగర్‌లో ఎమ్మెల్యే సొంత నిధులతో నిర్మించిన నూతన ఆలయంలో బుధవారం పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, సర్పంచ్ రేఖాకృష్ణ, ఎంపీటీసీ సంతోషతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వెంకటేశంగౌడ్, మాజీ ఎంపీపీ నిర్మలాప్రభాకర్, సర్పంచ్‌లు ప్రకాశ్‌చారి, ఖదీర్, ఆంజనేయులు, మాజీ సర్పంచ్ రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, సార నరేందర్, మండల కోఆప్షన్ సభ్యుడు ఇంతియాజ్, ఉపసర్పంచ్ ఫహీమ్, ప్రభాకర్‌రెడ్డి, కృష్ణాగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోచమ్మ దేవాలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన
అమీన్పూర్, ఆగస్టు 24: మానసిక ప్రశాంతతకు దేవాలయాలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు శ్రీరాంనగర్ కాలనీలో పోచమ్మ దేవాలయ నిర్మాణ పనులకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచమ్మ దేవాలయ నిర్వాహకులను అభినందించారు. వాణీనగర్‌లో ది నెస్టు వృద్ధాశ్రమ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ ఆశ్రమానికి పూర్తి సహాయ సకారాలు అందిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కౌన్సలర్లు కల్పనాఉపేందర్రెడ్డి, బిజీలి రాజు, చదువు మల్లేశ్, యూసూఫ్, కోఆఫ్షన్ సభ్యులు రాములు, నాయకులు చంద్రశేఖర్, లింగంగౌడ్ పాల్గొన్నారు.
ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
రామచంద్రాపురం, ఆగస్టు 24 : ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెల తండా, సందుగూడెం తండాలో నూతనంగా నిర్మించిన సేవాలాల్ మహరాజ్, భవానీ మాత ఆలయా ల్లో బుధవారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన సేవాలాల్ మహరాజ్, భవానీ మా తను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిమెల, సందుగూడెం, కొల్లూర్, ఐలాపూర్, రాళ్లకత్వలో సొంత నిధులతో సేవాలాల్ మహారాజ్ ఆలయాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ రాములుగౌడ్, కౌన్సిలర్లు రవీందర్‌రెడ్డి, సుచరితాకొమురయ్య, లచ్చిరాంనాయక్, మున్సిపల్ అధ్యక్షుడు దేవేందర్‌యాదవ్, నాయకులు, గిరిజనులు పాల్గొన్నారు.
పాటి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
పటాన్చెరు, ఆగస్టు 24 : ఆధునిక సౌకర్యాలతో నూత న గ్రామ పంచాయతీలను నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని పాటి గ్రామంలో సర్పంచ్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో జరిగిన నూతన పంచాయతీ భవన నిర్మాణం పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సర్పంచ్ సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పాటి గ్రామం రింగురోడ్డుకు ఆనుకుని ఉండడంతో అభివృద్ధి చెందుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ నాయక త్వంలో పంచాయతీలు అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. నూతన పంచాయతీ భవ నం ఆధునిక వసతులతో నిర్మిస్తామన్నారు. గ్రామం పల్లె ప్రగతిలో ముందున్నదని కొనియాడారు. ప్రభు త్వం అర్హులైన ప్రతిఒక్కరికీ పింఛన్లు, కల్యాణలక్ష్మి అందజేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు, గోపాల్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథరెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.