సర్దార్ సర్వాయి పాపన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయుడని.. సమైఖ్య పాలనలో తెలంగాణ పోరాట యోధుల చరిత్ర కనుమరుగైనదని… తెలంగాణ సిద్ధ్దించాకే మన పోరాట వీరులను గుర్తించి, స్మరిస్తున్నామని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొ న్నారు. సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంతి వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం మెదక్‌లోని రేణుకాంబ ఆలయం వద్ద పాపన్న విగ్రహానికి ఎమ్మెల్యేతోపాటు అధికారులు, వివిధ సంఘాల నాయ కులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలయం ప్రాంగణంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాధించిన తరువాతే సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కోమురయ్య, కొమురం భీం, చాకలి ఐలమ్మ వంటి పోరాట వీరులకు తగిన గుర్తిపు వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆశయాలను సాధించాలన్నారు. జిల్లా కేంద్రంలో గౌడ సంఘ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.
పాపన్న ఉద్యమకారుడు : అదనపు కలెక్టర్ రమేశ్
సర్వాయి పాపన్నగౌడ్ ఉద్యమకారుడని, ఆయనును ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అదనపు కలెక్టర్ రమేశ్ అన్నా రు. అన్ని వర్గాలకు చెందిన వారిని సైన్యంలో చేర్చుకొని బహుజనుల లక్ష్యాన్ని సాధించి చరిత్రలో నిలిచారన్నారు.
సర్వాయి మహోన్నత వ్యక్తి : ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
సర్వాయి పాపన్నగౌడ్ మహోన్నత వ్యక్తి అని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో పాపన్నగౌడ్ 372వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ పరిధిలోని గౌడ కులస్తులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న ప్రజానాయకుడు, బహుజన నాయకుడు అని కొనియాడారు. లండన్ మ్యూజియంలో పాపన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం గర్వించదగిన విషయమని, ఇది ఆయన గొప్పతనానికి నిదర్శనమన్నారు. నర్సాపూర్‌లో రూ.90 లక్షలు వెచ్చించి గౌడ కమ్యూనిటి హాల్ని నిర్మించామని, మిగిలిన పనులను పూర్తి చేయడానికి రూ.40 లక్షలుమంజూరు చేస్తానన్నారు.
బహుజన రాజ్యాధికారం కోసం పోరాడిన యోధుడు పాపన్నగౌడ్ అని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్ అన్నారు. చిలిపిచెడ్‌లో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కొల్చారం నుంచి నర్సాపూర్‌కు గౌడ సంఘం నాయకులు బైక్‌ర్యాలీగా వెళ్లారు. వెల్దుర్తి, మాసాయిపేట, నిజాంపేట, తూప్రాన్, చేగుం ట, నార్సింగి, చిన్నశంకరంపేట, అల్లాదుర్గం మండలాల్లో బీసీ, గౌడ, ప్రజా సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.