నర్సాపూర్, ఆగస్టు 16 : పట్టణంలో నిర్మిస్తున్న మున్సిపల్ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి ఆదేశించారు. మున్సిపల్ భవ న నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భవన నిర్మాణానికి అడ్డుగా నిలుస్తున్న చెట్లను తక్షణమే తొలిగించి, వేరే ప్రాంతానికి ప్లాంటేషన్ చేయాలని ఆర్డీ వో, అటవీశాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ అభివృద్ధికి రూ.25 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ మంజూ రు చేశారన్నారు. ఇందులో భాగంగా ఐబీ వద్ద మున్సిపల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. రెండు రోజుల్లోగా నిర్మాణ పనులు ప్రారంభించి, ఆరు నెలల్లో భవనం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ దర్శన్రావును ఆదేశించారు.
రూ.2 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు. నాణ్యతలో రాజీ పడకుండా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చాముండేశ్వరి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణాధ్యక్షుడు భిక్షపతి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలేశ్, పీఆర్డీఈ రాధికాలక్ష్మి, ఏఈ స్వామిదాస్, నాయకులు అశోక్‌గౌడ్, నగేశ్, ఆంజనేయులుగౌడ్, గొర్రె వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.