మునిపల్లి, ఆగస్టు 10 : బుధేరా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థి కొలంబియాలో జరిగిన జూనియర్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ హాడిల్స్ ఫైనల్ పోటీల్లో ఐదో స్థానం సాధించింది. బుధవారం తిరిగి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావడంతో కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, అధ్యాకప బృందం శాలువా, పూలమాలతో ఘన స్వాగతం పలికి జాతీయ పతాకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. మండలంలోని బుధేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న నందిని కొలంబియాలో జరిగిన జూనియర్ అథ్లెటిక్స్‌లో పాల్గొని దేశానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకురావడ సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలో ఐదో స్థానం సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. దేశంలోనే మొదటిసారి ఇంటర్నేషల్ వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో 100 మీటర్ల హాడిల్స్లో (13.34)సెకనల్లో రికార్డు నెలకొల్పిం ది. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి, కళాశాల బృందం పాల్గొన్నారు.