కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
మెదక్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : ప్రణాళికాబద్ధం గా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్లను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. వజ్రోత్సవాల నిర్వహణపై మంగళవారం కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమాలకు జిల్లాస్థాయి లో కలెక్టర్లు పక్కా కార్యాచరణ సిద్ధ్దం చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 10న ప్రతి గ్రామం, మున్సిపాలిటీలో ఫ్రీడం పార్క్‌గా కనీసం 75 మొక్కలు నాటాలన్నారు. 11న ఉద యం 6:30 నుంచి 8:00 గంటల వరకు మండలకేంద్రాల్లో ఫ్రీడం రన్ నిర్వహించాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధు లు, విద్యార్థులు, కళాకారులు, ప్రభుత్వ సిబ్బందిని ఫ్రీడం రన్లో భాగస్వామ్యం చేసూ పూర్తి చేయాలని ఆదేశించారు. 12న జాతీయ సమైక్యతపై రక్షాబంధన్, 13న జాతీయ జెండా, ఫ్లకార్డులతో విద్యార్థులు, ఉద్యోగులతో ఫ్రీడం ర్యాలీ నిర్వహించాలని, అనంతరం బెలూన్లు గాల్లోకి వదలలాలని తెలిపారు. 14న ప్రతి నియోజకవర్గంలో జానపద కళారూపాల ప్రదర్శన, 16న ఉదయం 11 గంటలకు రాష్ట్రవ్యాప్తం గా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలన్నారు. సామూహిక జాతీయ గీతాలాపనకు ప్రతి కూడలి, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాట్లు చేయాలని, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో గీతాలాపన చేయాలని సీఎస్ తెలిపారు.
ఆగస్టు 17న ప్రతి నియోజకవర్గంలో రక్తదాన శిబిరాలు, 11, 12న గ్రామస్థాయి, 13, 14న మండలస్థాయి, 16, 17న జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించాలని, 18న ఫ్రీడం కప్ విజేతలను నిర్ణయించాలన్నారు. 19న వృద్ధాశ్రమం, దవాఖానలు, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్ల పంపిణీ, 20న ముగ్గుల పోటీలు, 21న గ్రామ, మండల, జడ్పీ పరిషత్ సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాలపై పూర్తి సమాచారంతో నివేదికలు పంపాలని ఆదేశించారు. ఫ్రీడం రన్, ర్యాలీ, సామూహిక జాతీయ గీతాలాపన, ఫ్రీడమ్ కప్ నిర్వహణలో పోలీసులు కీలకపాత్ర పోషించి విజయవంతం చేయాలని పోలీ సు ఉన్నతాధికారులను డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులు, ట్రాఫిక్ జంక్షన్, ఇతర ముఖ్యమైన కూడలిలో సామూహిక జాతీయ గీతాలపన చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, అదనపు ఎస్పీ బాలస్వామి, జడ్పీ సీఈవో వెంకట శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, డీఎఫ్‌వో రవిప్రకాశ్, డీఈవో రమేశ్‌కుమార్, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.