నిజాంపేట, జూలై 18: పూర్వం రోజుల్లో పొలా న్ని దున్నుటకు పశువులను తమ వ్యవసాయ పనులకు వినియోగించేవారు. కాలక్రమేణా యాంత్రీకరణలో గణనీయమైన మార్పులు రావడంతో కొం తమంది రైతులు స్వతహాగా ట్రాక్టర్లను కొనుగోలు చేస్తే మరికొంతమంది రైతులు గంటల చొప్పున ట్రాక్టర్లను అద్దెకు తెచ్చుకుని తమ వ్యవసాయ పనులకు వాడుతున్నారు.
డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు యంత్రాలను నడపడంలో అజాగ్రత్త, తొందరపాటు వల్ల అవే యంత్రాల కింద పడి మృతి చెందుతున్నారు. కేజ్వీల్స్ ట్రాక్టర్లను నడిపే డ్రైవర్లకు పూర్తి స్థాయిలో నైపుణ్యం లేకపోవడం, ఓవర్ స్పీడుతో నడపడంతోనే ప్రమాదాలకు కారణమవుతున్నారు. నేల రకాల వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఒకచోట నేల వదులు గా మరొక చోట గట్టిగా ఉండటం చేత మూలమలుపులు వద్ద కేజ్వీల్స్ ట్రాక్టర్లు బోల్తా పడుతున్నాయి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు.
డ్రైవర్లు ఒత్తిడికి లోను కాకూడదు
కేజ్వీల్స్తో ట్రాక్టర్లను నడిపే డ్రైవర్లు ఒత్తిడికి లోను కాకూడదు. ట్రాక్టర్ల ముందు భాగంలో కేజ్వీల్స్కు సమానమైన బరువు బిళ్లలను అమర్చాలి. నైపుణ్యం లేకపోవ డం, వేగంగా నడపడం వల్లే చాలామంది డ్రైవర్లు మృత్యువాత పడుతున్నారు. పొలాన్ని దున్నుటకు వెళ్లే ముందే ట్రాక్టర్ల స్థితిని పూర్తిగా తెలుసుకున్నాకే పనులను ప్రారంభించాలి.
– సతీశ్, వ్యవసాయ అధికారి, నిజాంపేట