రామాయంపేట, జూలై 12 : గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని ఎంపీపీ నార్సింపేట భిక్షపతి పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేటలోని ఎంపీపీ కార్యాలయంలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. సభలో సభ్యులు మల్లన్నగారి నాగులు, శ్యాములు విద్యుత్ ఏఈపై మండిపడ్డారు. గ్రామాల్లో విద్యుత్ బిల్లులు అధిక మొత్తంలో వస్తున్నాయని నిలదీశారు.
ఏఈ పెంట్యా నాయక్ మాట్లాడుతూ అధిక బిల్లుల సమస్యలను ఆధారాలతో కార్యాలయానికి వస్తే సరి చేస్తామన్నారు. నూతనంగా ఏర్పాటైన గ్రామ పం చాయతీల్లో పంచాయతీ భవన నిర్మాణాలకు ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు చేసిందని, స్థానిక పంచాయతీ పాలకవర్గాలు భవన నిర్మాణానికి స్థలాలను చూపాలని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ భిక్షపతి మాట్లాడుతూ.. సభ్యులందరూ సమన్వ యంతో పని చేస్తూ మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాల న్నారు.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సహకారంతో మండలాన్ని మ రింత అభివృద్ధ్ది చేస్తామన్నారు. సమావేశంలో వైస్ ఎంపీపీ స్రవంతీసిద్ధ్దిరాంరెడ్డి, ఎంపీడీవో యాదగిరిరెడ్డి, తహసీల్ద్దార్ మన్నన్, మిషన్ భగీరథ డివిజనల్ ఇంజినీర్ శ్రీనివాస్, ఎంపీవో గిరిజారాణి, ఆయా గ్రామాల సర్పంచ్లు కాట్రియాల శ్యాములు, ఎంపీటీసీ నాగులు, పాకాల లత, పంచా యతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.