మెదక్ మున్సిపాలిటీ/ మెదక్ రూరల్/ రామాయంపేట/ కొల్చారం/ నిజాంపేట/ నర్సాపూర్/ చిన్నశంకరంపేట/ వెల్దుర్తి/ చేగుంట/ టేక్మాల్/ శివ్వంపేట, జూలై 10 : త్యాగానికి, అసమాన భక్తికి ప్రతీకైన బక్రీద్(ఈద్-ఉల్-జుహా) వేడు కలను జిల్లా కేంద్రం మెదక్‌లో ఆదివారం ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉపరితల ప్రభావంతో మూడు రోజులు గా కురుస్తున్న వర్షంతో జిల్లాకేంద్రంలోని ఈద్గా మైదానం చిత్తడిగా మారడంతో మసీదుల్లోనే ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రార్థ్ధనలు చేశారు. అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. కొందరు ముస్లిం సోదరులు పేదవారికి తగిన ఆర్థికసాయాన్ని అందజేశారు. పెద్దల సమాధుల వద్ద పూలతో నివాళులర్పించారు.
పేదలకు దానం చేయాలి : హఫీజ్ సదత్ హుస్సేన్ఖాద్రీ
పేదవారికి దానధర్మాలు చేయాలని ముస్లిం మతపెద్ద హఫీజ్ సదత్ హుస్సేన్ఖాద్రీ అన్నారు. బక్రీద్ పురస్కరించుకుని మెదక్ పెద్దబజార్‌లోని జామా మసీదులో మాట్లాడారు. మనిషి చెడు కు దూరంగా ఉంటూ మంచి సమాజ నిర్మాణానికి తమవంతు తోడ్పాటు అందించాలన్నారు. అల్లా ఆజ్ఞకు ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా బక్రీద్ జరుపుకొంటున్నామని మతపెద్ద హఫీజ్ వివరించారు. ప్రార్థనల్లో ముస్లింలు మహమ్మద్ ఆరీఫ్ హుస్సేన్, మహమ్మద్ ఏజాజొద్ద్దీన్, రఫీ, నయీమొద్దీన్, ఎండీ సబర్, ముజీబ్, సాధిక్, అజ్గర్ అలీ, ఆఫ్జల్, హఫీజ్, సలీం, ఫసీయొద్దీన్, ఎజాజ్, రియాజ్, ఫారుఖ్, సమీ, సాధిక్ తదితరులు పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా మసీదుల వద్ద పట్టణ సీఐ మధు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.
పల్లెల్లో భక్తిశ్రద్ధలతో బక్రీద్..
మెదక్ మండలంలో బక్రీద్ పండగను ముస్లింలు ఘనం గా నిర్వహించుకున్నారు. మసీదులు, ఈద్గాలు కిటకిలాడాయి. ముసింలు సంప్రదాయ దుస్తులు ధరించి మసీదులు, ఈద్గాల్ల్లో ప్రార్థనలు చేశారు. అనంతరం శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. టేక్మాల్ మండలకేంద్రంలో బక్రీద్ వేడుకలను స్థానిక మసీ దులో ముస్లిం సోదరులు నిర్వహించుకున్నారు. నమాజ్ అనంతరం ఒకరికి ఒకరు అలయ్ బలయ్ తీసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. తర్వాత పూర్వీకులకు సమాధులను పుష్పాలతో ఆలంకరించి నివాళులర్పించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు.
– మసీదుల్లోనే ఖవాలీ వినిపించిన మతపెద్దలు
రామాయంపేట పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో బక్రీద్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహిం చా రు. రామాయంపేట పట్టణంతోపాటు అక్కన్నపేట, కాట్రియా ల, లక్ష్మాపూర్, ధర్మారం(డీ), వెంకటాపూర్(ఆర్) గ్రామాల్లో బక్రీద్ వేడుకలు నిర్వహించారు. ముస్లింలకు హిందువులు శుభాక్షాంక్షలు చెప్పి, అలయ్‌బలయ్ తీసుకున్నారు. రామాయంపేట పట్టణంలోని మసీదులో భారీ సంఖ్యలో ముస్లింలు ప్రార్థ్ధనలు చేశారు. మతగురువు వినిపిస్తున్న ఖవాలీని మజీద్లోనే వీక్షించారు. రామాయంపేట పట్టణంతోబాటు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో ఎస్సై రాజేశ్ అధ్వర్యంలో మసీదులు, ఈద్గాల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు.
కొల్చారం మండలవ్యాప్తంగా బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాదుల వద్ద పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు.
నిజాంపేట మండలకేంద్రంతోపాటు కల్వకుంట, నందిగామ, చల్మెడ, నస్కల్, నందగోకుల్, నార్లపూర్ గ్రామాల్లో బక్రీద్ పండుగను ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిజాంపేట మసీదులో మతపెద్ద మాట్లాడుతూ.. త్యాగానికి ప్రతీకగా బక్రీద్‌ను ముస్లింలు నిర్వహిస్తారని తెలిపారు.
నర్సాపూర్ పట్టణంతోపాటు మండలంలో బక్రీద్ పండుగ ను ముస్లింలు భక్తిశ్రద్ధ్దలతో నిర్వహించారు. నర్సాపూర్‌లోని ఈద్గా వద్ద ముస్లిం ప్రజలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, ఏఎంసీ వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, డైరెక్టర్ రావూఫ్, న్యాయవాది జాఫర్ పాల్గొన్నారు.
చిన్నశంకరంపేటతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించారు.
వెల్దుర్తి ఉమ్మడి మండలవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్ పండుగను నిర్వహించారు. తొలి ఏకాదశి, బక్రీద్ పండుగలు ఒకే రోజు రావడతో గ్రామాల్లో మతసామరస్యం వెల్లివిరిసింది.
చేగుంట, నార్సింగి మండలాల్లో బక్రీద్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా ముస్లిం సోదరులు మసీదులు, ఇండ్లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శివ్వంపేట మండలంలో బక్రీద్ పండగను ముస్లింలు నిర్వ హించారు. ఆయా గ్రామాల్లోని దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శివ్వంపేట, దొంతి గ్రామాల్లో ముస్లింలు భారీ సంఖ్య లో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోన్నారు. బక్రీద్ వేడుకల్లో మండల కోఆప్షన్ సభ్యుడు లాయక్, టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు షఫియొద్దీన్, షేక్‌అలీ, అబ్దుల్అజీజ్, మతపెద్దలు పాల్గొన్నారు.