
దత్తాచలక్షేత్రం వద్ద కొనసాగే పూజాకార్యక్రమాలు..
ఈ నెల 14న ప్రారంభమైన దత్తాచలక్షేత్ర బ్రహ్మోత్సవాలు 19 వరకు కొనసాగనున్నాయి. 14న (మంగళవారం) గణపతిపూజ, స్వస్తిపుణ్యాహ వచనం, అఖండ దీపారాధన, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠ, ప్రత్యేక హోమాలు, అర్చనలు, మంగళహారతి, ధ్వజస్తంభ జలాధివాసం, మండపపూజ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 15(నేడు)న చండీ పారాయణం, విశిష్ఠ హవనములు, ధ్వజస్తంభ ధాన్యాదివాసములు, 16న శత రుద్రాభిషేకకాలు, వేద పారాయణం, లక్ష్మీసుదర్శన, దత్తహవనం, చండీ హోమం, ధ్వజస్తంభ పుష్పఫల శయ్య హిరణ్యాదివాసాలు, 17న మహన్యాస పూర్వక శత రుద్రాభిషేకాలు, వేదపారాయణం, గురుచరిత్ర పారాయణం, మంటపస్థిత దేవతాపూజలు, దీపాలంకరణ, హారతి మంత్రం, 18న దత్తహవనం, మహా రుద్రసహిత చండీయాగం, ఆవాహిత దేవతల హవనం, సాయంత్రం బండ్ల ఊరేగింపు, రథోత్సవం, పల్లకీసేవ, మంగళహారతి, 19న 101 పుణ్య దంపతులతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు, పాచిబండ్ల ఊరేగింపు తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. కాగా, భక్తుల సౌకర్యార్థం ఉత్సవాల సందర్భంగా నిత్యాన్నదానం చేయబడును.
బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్న ప్రముఖులు..
దత్తజయంతి బ్రహ్మోత్సవాలకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
దాతల సహకారంతోఆలయ అభివృద్ధి..
దత్తాచలక్షేత్రం అభివృద్ధికి ఎంతో మంది దాతలు ముందుకువచ్చి సహాయం అందిస్తున్నారు. దాతల సహకారంతో ఏటా బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పా చేస్తున్నాం. దత్తజయంతి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు.