నిజాంపేట/ రామాయంపేట/ వెల్దుర్తి/ నర్సాపూర్, జూన్ 28 : రైతుల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రైతునేస్తమని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం రైతుబంధు పథకం డబ్బులు జమ చేయ డంపై హార్షం వ్యక్తం చేస్తూ మంగళవారం నిజాంపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. రైతుబంధు డబ్బులను రైతులు వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు అనూష, అరుణ్‌కుమార్, చల్మెడ ఎంపీటీసీ బాల్‌రెడ్డి, టీఆర్ఎస్వై మండల అధ్యక్షుడు మావురం రాజు, వార్డు సభ్యుడు తిరుమల్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అబ్దుల్‌పాషా, స్వామి, నగేశ్, రాజు తదితరులు ఉన్నారు.
రామాయంపేటలో రైతుల సంబురాలు
రామాయంపేట మండలంలో రైతుబంధు పఘకంలో పెట్టుబడి సాయం అందడంతో రైతులు సంబురాలు నిర్వహించారు. రామాయంపేట పట్టణంలోని ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి ఆధ్వర్యంలో రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఝాన్సీలింగాపూర్ గ్రామంలో రైతుబంధు మండల అధ్యక్షుడు నర్సారెడ్డి ఆధ్వర్యంలో సర్పంచ్ జ్యోతి, మాజీ సర్పంచ్ రామకిష్టయ్య,వార్డు సభ్యులు రైతులకు మిఠాయిలు అందజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతుల పాలిట కల్పతరువని, ఏ ఆపద వచ్చినా ఆదుకుంటారన్నారు.
రైతుబంధు విడుదలపై అన్నదాత హర్షం…
వెల్దుర్తి ఉమ్మడి మండలంలో 13092 మంది రైతులు ఉం డగా, 33 వేల ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో 25 వేల ఎకరాల్లో రైతులు వరి, మొక్కజోన్న, జొన్న, పొద్దుతిరుగుడు, పత్తితో పాటు పప్పుదినుసులు, నూనె గింజలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. సుమారు 3 వేల ఎకరాల్లో పలు రకాల పండ్లు, ఇతర తోటల సాగు చేపట్టారు. వానకాలం ప్రారంభం కావడంతో బోరుబావులు, నీటి సౌలభ్యం ఉన్నచోట రైతులు వరినారు పోశారు. రైతుబంధు పథకంలో మండలంలోని 5,328 మంది రైతులకు రూ1.43కోట్లు రైతుల ఖా తాల్లో జమ అయినట్లు మండల వ్యవసాయ అధికారి ఝాన్సీ తెలిపారు. పెట్టబడి సాయం అందడంతో రైతులు సంతోషంతో ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు.
రైతుబంధు పథకానికి దరఖాస్తు చేసుకోవాలి
రైతుబంధు పథకానికి రైతులు దరఖాస్తు చేసుకోవాలని నర్సాపూర్ ఏవో అనిల్‌కుమార్ పేర్కొన్నారు. జూన్ 22 తేదీలోపు కొత్తగా పాస్‌బుక్‌లు వచ్చిన రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ పత్రాలను సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు వచ్చిన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో అనిల్‌కుమార్ తెలిపారు.