మెదక్ రూరల్, జూన్27: సీఎం కేసీఆర్ ప్రభుత్వం గ్రామీ ణ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ప్రతి గ్రామం లో క్రీడా ప్రాంగణాలను నిర్మించి క్రీడాకారులకు ప్రాధాన్యత కల్పిస్తున్నదని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మంబోజిపల్లిలో తెలంగాణ క్రీడ ప్రాంగణా న్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడి,్డ జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రజా ప్రతినిధులతో కలిసి వాలీబాల్ ఆడారు. క్రీడాప్రాంగణం చుట్టూ మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పల్లెలో క్రీడ ప్రాంగణాల ఏర్పాటుతో గ్రామంలో మంచి వాతావారణం ఏర్పడుతుందన్నారు. క్రీడా ప్రాంగణాలను యువ త సద్వినియోగం చేసుకుని క్రీడా రంగాల్లో రాణించాలన్నా రు. ప్రతి క్రీడా ప్రాంగణం చుట్టూ నీడనిచ్చే మొక్కలు పెంచాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ యమునాజయరాంరెడ్డి, సర్పంచ్ గంజిప్రభాకర్, ఎంపీటీసీ మానస రాములు, చిట్యా ల సర్పంచ్ వెంకటేశం, మండల అధికారులు, శ్రీనివాస్, సల్మాన్, సుధాకర్, వేణుగోపాలరెడ్డి, గౌతమి, ఉపసర్పంచ్ సత్తయ్య, వార్డు సభ్యులు, నాయకులు జయరాంరెడ్డి, వెంకటేశం, అంజాగౌడ్, ఆంజనేయు లు, రాములు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఉన్నారు.
క్రీడలకు ప్రభుత్వం పెద్ద పీట
క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తు న్నదని ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్ అన్నారు. చేగుంటలోని గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదర్శ పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తున్నదని, ప్రతి గ్రామంలో క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేయడం వల్ల యువకులు పలు రకాల క్రీడల్లో పాల్గొనడంతో శారీరక, ఆరోగ్య పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మీ, సొసైటి డైరెక్టర్ రఘురాములు, ఎంపీడీవో ఉమాదేవి, ఈవో రాణి, ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, ఏపీవో సంతోష్, సీసీ స్వేత, వార్డు సభ్యులు వల్ప మహేష్, కూన సంతోష్, కుమార్, సూరిబాబు, చింతా ల భూపాల్, నాయకులు ఎల్లేష్, అన్నం రవి, వెంకటి, రాజే ష్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.