టేక్మాల్, జూన్25: మండలంలోని 13 గ్రామాల రోడ్ల మరమ్మతులకు రూ.8.79 కోట్లు మంజూరైనట్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ప్రధాన కార్యదర్శి అవినాశ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పీడబ్ల్యూడీ రోడ్డు అస్సద్ మహ్మద్పల్లి నుంచి తండా వరకు రూ.90 లక్షలు, టేక్మాల్ నుంచి ఎల్లకుర్తి పీడబ్ల్యూడీ రోడ్డుకు రూ.97 లక్షలు, అచ్చన్నపల్లి నుంచి అస్సద్మహ్మద్పల్లికి రూ.1.83 కోట్లు, తంపూలుర్ మీదుగా బుర్గుపల్లి వరకు రూ.1.08 కోట్లు, బర్ధిపూర్ రోడ్డుకు రూ.75 లక్షలు, షాబాద్తండా రోడ్డుకు రూ.45 లక్షలు, వెల్పుగొండ రోడ్డుకు రూ.36 లక్షలు, బోడగట్టు రోడ్డుకు రూ.27 లక్షలు, వెంకటపూర్ రోడ్డుకు రూ.57 లక్షలు, కార్లూర్ రోడ్డుకు రూ.18 లక్షలు, దాదాయిపల్లి రోడ్డుకు రూ.66 లక్షలు, మల్కాపూర్ రోడ్డుకు రూ.54 లక్షలు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఎల్లంపల్లి తండా వరకు రూ.23 లక్షల నిధులు అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రత్యేక చొరవతో మంజూరయ్యాయని తెలిపారు. సీఎం కేసీఆర్, ఆర్థిక శాఖమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో సర్పంచ్‌లు నారాయణ, సంగయ్య, నాయకులు రవి, సిద్ధయ్య, మహేందర్, శ్రీశైలం ఉన్నారు.