శివ్వంపేట, జూన్ 21: గ్రామాల్లో ఏర్పాటు చేసే నిఘా నేత్రాలతో నేరాలకు చెక్ పెట్టవచ్చని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిణి అన్నారు. మంగళవారం మండలంలోని నవాబ్ పేటలో ఫ్లెమింగ్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ సహాయంతో దాదాపు రూ. 3లక్షల50వేలతో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను సర్పంచ్ అశోక్‌రెడ్డి, ఎంపీపీ కల్లూరి హరికృష్ణతో కలి సి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫ్లె మింగ్ ల్యాబొరేటరీస్ పరిశ్రమ ముందుకు వచ్చి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామంలో ఒక్కో కుటుంబం తలా వంద రూపాయల చొప్పు న వేసుకుంటే ఆ డబ్బులతో సీసీ కెమెరాలు పాడైతే మరమ్మతులు చేసుకోవచ్చన్నారు. శాంతిభద్రతల కట్టడికి, ఎవిడెన్స్ కోసం సీసీ కెమెరాలు ఉపయోగపడుతాయన్నారు.
ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ముఖ్యంగా సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో ఎక్కువ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాతపడుతున్న వారి సంఖ్య పెరుగుతుందన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తామన్నా రు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మృత్యువాత పడితే ఆ కు టుంబం కోలుకోలేని దీనస్థితికి చేరుకుంటుందన్నారు.
దీని నివారణకు రోడ్డు నిబంధనలను పాటించాలన్నారు. గ్రామా ల్లో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు క్షణికావేశంలో గొడవలు చేసుకోని పోలీస్‌స్టేషన్ వైపు పరుగులు పెట్టి సమయాన్ని వృథా చేసుకోకుండా గ్రామంలోనే గ్రామ పెద్దలతో సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. నవాబ్‌పేట గ్రామాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని సర్పంచ్‌లు వారి వారి గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు.
కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జడ్పీ కోఆప్షన్ స భ్యులు మన్సూర్, ఫ్లెమింగ్ ల్యాబరేటరీస్ పరిశ్రమ ప్రతినిధి ప్రదీప్, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, సీఐ శ్రీధర్, ఎస్ఐ రవికాంత్‌రావు, సర్పంచ్ అశోక్‌రెడ్డి, పెద్దగొట్టిముక్ల సర్పంచ్ చంద్రకళ శ్రీశైలం యాదవ్, ఉప సర్పంచ్ ప్రేమ్‌దాస్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఉన్నారు.