పెద్దశంకరంపేట, జూన్ 21: అనుమానాస్పద స్థితిలో మతిస్థిమితం లేని మహిళ మృతి చెందిన ఘటన శివయపల్లిలో చోటుచేసుకుంది. అల్లాదుర్గం సీఐ జార్జ్, పేట ఎస్ఐ బాలరాజు కథనం ప్రకారం.. శివయపల్లి గ్రామానికి చెందిన కుక్కల లక్ష్మి(38) శివయపల్లి శివారులో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిందన్నారు. ఇది ఇలా ఉండగా హవేళీఘన్పూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన ఎంబరి లింగంతో 18సంవత్సరాల క్రితం వివాహం కాగా, వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నా రు.
భర్తతో మనస్పర్థం రావడంతో రెండు సంవత్సరాల క్రితం తన పిల్లలతో తన తల్లిగారి ఇంటికి వచ్చిందన్నా రు. భర్త దూరం కావడంతో లక్ష్మి మతిస్థిమితం కోల్పో యిందని కుటుంబ సభ్యులు తెలిపారు. వారం రోజుల నుంచి లక్ష్మి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం గ్రామస్తులకు గ్రామ శివారులో మృతదేహం కనిపించడంతో సర్పంచ్ నరేష్ తెలుపగా సర్పంచ్ పోలీసులకు సమచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
హత్య చేసినట్లు అనుమానం
మహిళను పొలంలో పాతి పెట్టగా రెండు రోజులుగా కురిసిన వర్షాలకు మహిళ కాళ్లు, చేతులు పైకి తేలాయి. సంఘటనా స్థలంలో కొద్ది దూరంలో ఆమె దుస్తులు, మద్యం సీసాలు దొరికాయి. పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం కోసం జోగిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి అన్న సంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.