మెదక్ రూరల్, జూన్ 21: మానవులు తమ జీవన శైలితో పాటు పరిశుభ్రత పాటించడం వల్ల సగటు ఆ యుస్సు పెరుగుతాదని మెదక్ వైద్యాధికారి వెంకటేశ్వ ర్రావు అన్నారు. మంగళవారం మహిళా సమైక్య భవనంలో భారత ప్రభుత్వం పర్సనల్ అండ్ ట్రైనింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డాక్టర్ మర్రి చెన్నరెడ్డి మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులకు హెల్త్ కేర్ అండ్ శానిటేషన్పై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగలు రెండు రకాలని ఒకరి నుంచి మరోకరికి సంక్రమించే వ్యాధులు ఒక్కటైతే మన జీవన శైలి విధానం ద్వారా తెచ్చుకునేవి రెండో రకం అని అన్నారు. ఇందులో ప్రధానంగా హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్ వంటివని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి సెల్ఫోన్ ఆలవా టు చేయడం, ఆటలకు దూరంగా ఉంచడం, చదవుపై ఒత్తిడి పెంచడం తదితర కారణాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. ఆటలు ఆడటం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఎక్కువగా సంప్రదాయ వంటకాలను, ఆకు కూరలను తినాలని సూచించారు.
కరోనా సమయంలో 70-80ఏండ్ల ముసలివాళ్లు, 25-30ఏండ్ల లోపు యువత చనిపోయారని అన్నారు. పొగాకుకు దూరంగా ఉండాలని, ఉప్పు తగ్గించాలన్నారు. అదే విధంగా ఇంటి ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఆర్డీ రీజినల్ ట్రైనింగ్ మేనేజర్ బాలయ్య, డీపీఆర్వో శాంతికుమార్, వివిధ శాఖల ఉద్యోగులు ఉన్నారు.