కొల్చారం, జూన్ 21 : మండలంలోని వరిగుంతం గ్రామంలో వానకాలం పంటలసాగుపై రైతులకు మంగళవారం ఏఈవో భార్గవ్ అవగాహన సదస్సు నిర్వహించారు. వరి సాగులో వెదసాగు, డ్రమ్ సీడర్ పద్ధతుల గురించి వివరిస్తూ ఎకరాకు రూ.6 నుంచి రూ.8వేల పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చన్నారు. గ్రా మంలోని భూముల్లో ఫాస్పరస్/ భాస్వరం ములకాలు సమృద్ధిగా ఉన్నందునా డీఏపీ అధిక మోతాదులో వాడితే ఎక్కువై న భాస్వరం భూమిలో లభ్యంకాని రూ పంలోకి మారుతుందన్నారు. డీఏపీ స్థా నంలో పీఎస్బీ ఫాస్పరస్, సోలుబ్యూలిజింగ్ బ్యాక్టీరియా ఉపయోగిస్తే భూమిలో ఉన్న భాస్వరం మొక్కలకు అందుబాటులోకి వస్తుందని వివరించారు. పంటల యాజమాన్య పద్ధ్దతులు వివరించే పుస్తకాలను రైతులకు అందజేశారు. సదస్సులో సర్పంచ్ ఉమారాణీశ్రీకాంత్, ఎంపీ టీసీ, రైతుబంధు గ్రామ కోఆర్డినేటర్ హరిచం ద్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్ ఉన్నారు.
పంటలసాగుపై అవగాహన సదస్సు
తూప్రాన్, జూన్ 21 : పట్టణంలోని రైతువేదికలో రైతులకు వెదజల్లే పద్ధ్దతి, పచ్చిరొట్ట ఎరువులు, యాజమాన్య పద్ధ తులను ఏవో గంగమల్లు వివరించారు. సదస్సులో రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ సురేందర్‌రెడ్డి, ఎంపీపీ స్వప్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, రాజేశ్వర్‌శర్మ, ఏఈవోలు సంతోశ్, సింధు, కౌన్సిలర్లు, రైతులు పాల్గొన్నారు.