రామాయంపేట, జూన్21: విద్యార్థులకు మెరుగైన విద్య ను అందించేందుకు ప్రభుత్వం పని చేస్తున్నదని మెదక్ ఎ మ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలికల పాఠశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే ముందుగా సరస్వతీమాతకు పూజలు చేసి విద్యాధికారి రమేశ్‌తో కలిసి చిన్నారులకు అక్షరభ్యాసం చేయించారు. అనంత రం రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, మండల అధ్యక్షు డు మహేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో ఉచితంగా నోటు బుక్కులను అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో చదివించే తల్లితండ్రులు ప్రభుత్వ బడికే విద్యార్థులను పంపించాలన్నారు. ప్రభుత్వ బడిలో చదివే విద్యార్థులకు ఉచితంగా విద్యతో పాటు పాఠ్యపుస్తకాలు, భోజనం పెడుతుందన్నారు. ప్రభుత్వ బడుల అభివృద్ధి కోసం రామాయంపేట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. కోటి90లక్షల నిధులను మంజూరు చేశారన్నారు. దీంతో పాటు ప్రాథమిక పాఠశాలకు సుమారు రూ. 29లక్షల కేటాయించారన్నారు.
మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభు త్వ బడుల అభివృద్ధికి మండలాల వారీగా మొదటి విడతగా 33శాతం నిధులను సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు తెలిపారు. రామాయంపేట పట్టణ అభివృద్ధికి రూ. 15కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఇవే కాకుం డా పట్టణ మున్సిపల్లో వార్డుకు రూ. 50లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారన్నారు.
పట్టణంలోని మేయిన్ రోడ్డుకు రూ. 2కోట్ల 80లక్షలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఆగస్టు 7న డబుల్ బెడ్రూంలను లబ్ధిదారులకు ఇస్తారన్నారు. నిరుపేదలు, ఇళ్లులేని వారికే డబుల్‌బెడ్ రూం ఇళ్లు వస్తాయన్నారు. సొంత స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం రూ. 3లక్షలను ఇస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్, ఎంఈవో, నీలకంఠం, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, జడ్పీటీసీ సంధ్య, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, పాఠశాలల హెచ్ఎంలు రాగి రాములు, రాధిక, కౌన్సిలర్లు దేమె యాదగిరి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు బండారి మహేందర్‌రెడ్డి, గజవాడ నాగరాజు, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాంరెడ్డి, ఎంఆర్పీలు ఆకుల రాజు, సంతోష్, రాములు, రమేశ్ ఉన్నారు.