చేగుంట, జూన్19: బంచిక్ బంబం చెయ్యు యోగా.. యోగా ఒం టికి మంచిదేగా.. లేజీగా ఒళ్లు పెం చుకోక.. నాజూగ్గా ఉంచు లేత తీగలాగా.. అన్నాడో సినీ కవి. ఉరుకులు పరుగుల యాంత్రిక జీవితంలో మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు యోగా చాలా ఉపయోగపడుతుంది. సరైన విశ్రాంతి లేక సమయానుకూలంగా భోజనం దొరకక అనేక వ్యాధులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఉబ్బసం, గుండె జబ్బులు, నరాల బలహీనత, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. యోగాసనాలతో మేధాశక్తి, అందం పెరుగుతుంది. శరీరంలోని కండరాల్లో, నరాల్లో రక్తప్రసరణ సమతుల్యంగా ఉంచుతుంది. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందే అవకాశం ఉంది.
రాష్ట్రస్థాయిలో 14సార్లు మెదక్ జిల్లాదే పై చేయి
జిల్లాలో 1979లో యోగా గురువు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆముద రాంచంద్రం ఆశీర్వాదాల ఈ యోగాను ప్రారంభించారు. 1988లో యోగా సంఘం ఏర్పాటుతో పాటు పలు చోట్ల శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా యోగా విస్తరించింది. దీన్ని ప్రత్యేకంగా గ్రామస్థాయికి చేర్చాల్సిన అవసరం ఉంది. గతంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి డివిజన్లలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోనే మెదక్ జిల్లాలో యోగాకు ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు 27 సార్లు ఈ యోగా పోటీల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొన్నారు.
14 సార్లు జిల్లా క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో యోగాను ప్రవేశపెట్టినప్పటి నుంచి 13 సార్లు ప్రతిసారి జిల్లా క్రీడాకారులు అండర్-14, 17, 19 బాలబాలికల విభాగంలో రాష్ట్ర స్థాయి చాంపియన్‌షిప్‌ను సాధించడంలో పైచేయి కనబరుస్తున్నారు. యోగాను లోక కల్యాణం కోసం పతంజలి మహర్షి యోగా దర్శనం రూ పొందించారు. ఈ శాస్త్రం 8 అంగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, దారణ, ధ్యాన, స మాధిగా విభజించారు. జ్ఞానయోగం, ఆసన, ప్రాణాయామంతో హట యోగం, ప్రత్యాహారం తో కరుణ యో గం, దారణ, ధ్యాన, సమాధితో రాజయోగం సిద్ధిస్తుంది.

యోగా ఎవరు చేయవచ్చు
యోగాను అన్నిరకాల వారు చేయవచ్చు. నాలుగేం డ్ల నుంచి జీవన మంత్ర యోగా ఫౌండేషన్‌తో చేగుంటతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు వివిధ రకాల రుగ్మతులకు సంబంధించిన ఆసనాలను ఉచితంగా నేర్పిస్తున్నాం. కరోనా కట్టడి చేసే ఆసనాలను ఆన్లైన్, జూమ్ వేదికలో నేర్పించడంతో చాలా మంది ఆరోగ్యవంతులయ్యారు.
– అల్లి నరేశ్, జీవన్ మంత్ర యోగా ఫౌండేషన్
వేల సంఖ్యలో శిష్యులు
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటగా నేను యోగా నేర్చుకుని ఆచరించా. ఇతరులకు పరిచయం చేసి జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందా. ఎంతో మంది యోగాలో శిక్షణ ఇస్తున్నా. ఇందుకోసం 319 పేజీల పుస్తకాన్ని రూపొందించి ఉచితంగా అందజేస్తున్నా.
– ఆముద రాంచంద్రం, యోగా గురువు
సమయానుకూలంగా..
యోగా చేయడానికి ఉదయం, సా యంత్రం అనుకూలంగా ఉం టుంది. యోగా చేసే ముందు కాలకృత్యాలు తీర్చుకోవాలి. దంత ద హనం చేసిన తర్వాత యోగాలో పాల్గొనాలి. అల్పాహారం తీసుకున్న గంట, భోజనం చేసిన రెండు గంటల తర్వాత యోగాసనాలు వేయాలి.
– కరణం గణేశ్ రవికుమార్, యోగా కోచ్