
చిలిపిచెడ్, నవంబర్ 19 : జగ్గంపేట గ్రామంలో శుక్రవారం పశువైద్య సిబ్బంది పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మంతప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ సురేశ్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామంలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు తప్పని సరిగా వేయించాలని రైతులకు సూచించారు. టీకాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్నదని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్‌లు శంకర్, అరవిం ద్, పాడి రైతులు పాల్గొన్నారు.
రామాయంపేటలో..
పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని పశువైద్యాధికారి సుధాకర్ దేశ్‌ముఖ్ సూచించారు. శుక్రవారం రామాయంపేట మండల పరిధిలోని డీ ధర్మారం గ్రామంలో గాలికుంటు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొడ్డు శంకర్, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.
మనోహరాబాద్‌లో..
గాలికుంటు వ్యాధి సోకకుండా పశువులకు ముందు జాగ్రత్తగా వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని పశువైద్యాధికారులు వినోద్, ప్రియాంక అన్నారు. శివ్వంపేట మండలం పాంబండలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను శుక్రవారం వేశారు. మూడు నెలలు పైబడిన అన్ని పశువులకు నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలన్నారు.