అందోల్ నియోజకవర్గంలోని అందోల్, అల్లాదుర్గం, వట్పల్లి, టేక్మాల్ మండలాల రైతులకు మహర్దశ పట్టనున్నది. రూ.36.17 కోట్లతో నిర్మించిన తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల ప్రారంభానికి సిద్ధమైంది. ఈ ప్రాజెక్టుతో నాలుగు మండలాల్లోని 14 గ్రామాల్లో ఏండ్లుగా పడావుగా ఉన్న 13వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. మొత్తం 0.117 టీఎంసీల నీటిని ఎత్తిపోయనుండగా, ఇందుకోసం వట్పల్లి మండలం సాయిపేట శివారులో సింగూరు బ్యాక్ వాటర్ వద్ద పంపుహౌస్ నిర్మించి తాలెల్మ గట్టుపై మూడు ఫీడర్లు ఏర్పాటు చేశారు. సాయిపేట నుంచి తాలెల్మ గట్టువరకు సుమారు నాలుగు కిలోమీటర్లు పైపులైన్లు వేసి అక్కడి నుంచి పైపుల ద్వారా చెరువులను నింపడంతో పాటు వ్యవసాయ భూములకు సాగునీరందించనున్నారు. ఇప్పటికే ట్రయల్ రన్ పూర్తవగా నేడు మంత్రి హరీశ్‌రావు ఎత్తిపోతను ప్రారంభించనున్నారు. శనివారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఏర్పాట్లను పరిశీలించారు.
అందోల్, జూన్ 19: నియోజకవర్గంలోని అందోల్, అల్లాదుర్గం, వట్పల్లి, టేక్మాల్ మండలాల్లోని 14 గ్రామాల రైతులకు సాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం నిర్మాణం పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధమైంది. వట్పల్లి మండలం సాయిపేట్ గ్రామ శివారు లో సింగూర్ బ్యాక్ వాట ర్ వద్ద పంపుహౌస్ నిర్మించి తాలెల్మ గట్టుపై మూడు ఫీడర్లు ఏర్పా టు చేశారు. సాయిపేట నుంచి తాలెల్మ గట్టువరకు సుమారు నాలుగు కిలోమీటర్లు పైపులైన్లను ఏర్పాటు చేయగా అక్కడి నుంచి పైపుల ద్వారా నాలు గు మండలాల్లోన్ని 14గ్రామాల రైతుల భూములకు సాగునీరందనున్నది.
సింగూర్ బ్యాక్ వాటర్ నుంచి 0.117 టీఎంసీల నీటిని ఎత్తిపోతలకు వాడుకోనుండగా దీని ద్వారా ప్రత్యక్షంగా 3వేల ఎకరాలకు.. పరోక్షంగా 10వేల ఎకరాలకు సాగు నీరందనున్నది. సోమవారం ఈ పథకం ప్రారంభం కానుండగా ఏండ్లుగా పడావుగా ఉన్న బీడు భూముల్లో జల సవ్వడి చేస్తూ పచ్చని పంట పొలాలు దర్శనమివ్వనున్నాయి. 20న మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా ఎత్తిపోతల పథకం ప్రారంభం కానుండగా, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సూచనలతో అధికారులు అందుకు తగిన ఏర్పా ట్లు చేస్తున్నారు. రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలనే ఉద్ధేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఎత్తిపోతల నిర్మాణం కోసం రూ. 36.17కోట్లను మంజూరు చేసింది.
దీంతో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమై పను లు చకచకా సాగగా, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ పట్టువదలని విక్రమార్కుడిలా అధికారుల వెంటపడి పనులను ఎప్పటికప్పు డూ పర్యవేక్షించి తగిన సూచనలు చేస్తూ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభానికి సిద్ధం చేశారు. మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహం, ఎమ్మెల్యే ప్రత్యేక కృషితో రైతుల దశాబ్దాల కల నిజం కానుండగా రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ మహా ఘట్టానికి తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఆవరణ వేదిక కా నుండగా వేలాదిగా రైతులు, పార్టీ శ్రేణులు హాజరు కానున్నారు. వారి సమక్ష్యంలో మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి ఎత్తిపోతలను ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నారు.

ట్రయల్ రన్ పూర్తి
తాలెల్మ గట్టుపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం పనులు పూర్తికావడంతో ఎక్కడ సాంకేతికలోపం తలెత్తకుండా ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఇటీవల అధికారులతో కలిసి ట్రయల్న్ నిర్వహించారు. మూడు ఫీడర్ల ద్వారా ఏర్పాటు చేసిన పైపులైన్ల వెంట తిరుగుతూ సాంకేతిక లోపాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అధికారులు మరోసారి పరిశీలించి లీకేజీలు, ఇతర సమస్యలుంటే చెప్పాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి సమస్య లేకపోవడంతో 20న ఎత్తిపోతల పథకాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదటి ఫీడ ర్ పైపులైన్ ద్వారా అందోల్ మండలంలోని తాలెల్మ, నేరడిగుంట, ఎర్రారం. రెండో ఫీడర్ నుంచి కన్సాన్పల్లి, రంసాన్పల్లి, మాసాన్‌పల్లి, వట్పల్లి మండలంలోని కేరూర్, అల్లాదుర్గం మండలంలోని గడిపెద్దాపూర్, టేక్మాల్ మండలంలోని కుసంగి, మూడో ఫీడర్ ద్వారా తాలెల్మ, అక్సాన్‌పల్లి, బ్రాహ్మణపల్లి, వట్పల్లి మండలంలోని సాయిపేట, ఖాదీరాబాద్ గ్రామాల్లో 40 చెరువులను నింపి పంటల సాగుకు నీరందించేలా ఏర్పాట్లు చేశారు. రైతులు తగిన సహాయ సహకారాలు అందించడం, అధికారులు పనులు త్వరగా చేపట్టడం, ఎమ్మెల్యే ఎప్పట్టికప్పుడు రైతులు, అధికారులతో మాట్లాడడంతో పనులు త్వరగా పూర్తై తాలెల్మ ఎత్తిపోతల ప్రారంభానికి సిద్ధమైంది.
నెరవేరనున్న రైతుల కల
పొలాల్లో పంటలు వేయాలంటే ఆకాశం వైపునకు చూసే ఈ ప్రాంత రైతులు ఎత్తిపోతల పథకం కోసం ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగుచేసే రైతులు చెరువులు, కుంటలు నిండితే ఆ నీటిని చూసి మురిసిపోతూ ఉన్నంతలో పంటలను సాగుచేస్తుండగా ఇకపై వీరికి మంచి రోజులు రానున్నాయి. రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు మండలాల రైతులకు ఉపయోగపడేలా ఎత్తిపోతల నిర్మాణం చేపట్టింది. రేణుకా ఎల్ల మ్మ ఎత్తిపోతలకు రూ. 36.17కోట్లు వెచ్చించి నిర్మించడంతో నాలుగు మండలాల్లో వేల ఎకరాల భూములు సాగులోకి వచ్చి నిన్నటి వరకు బీడుగా మారిన ప్రాంతం రానున్న రోజు ల్లో పచ్చని పంటలతో కళ కళలాడనున్నది.
ఈ ఎత్తిపోతలతో నియోజకవర్గంలోని అందోల్, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల్లో 14గ్రామాలకు ఉపయోగ పడే విధంగా 40చెరువులను నింపి 3వేల ఎకరాలకు ప్రత్యక్షంగా మరో 10వేల ఎకరాలకు పరోక్షంగా సాగునీరందనున్నది. దీంతో దశాబ్దాల కలనెరవేరి బీడుగా మారిన ఆయకట్టు సాగులోకి రానుండగా ఎత్తిపోతల పథకం విస్తరించి ఉన్న ప్రాంతమంతా భూగర్భ జలాలు సైతం వృద్ధి చెందనుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాయిపేటలోని పంపుహౌస్ వద్ద 430హెచ్‌పీ సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లను ఏర్పాటు చేయగా ఒక్కో మోటరు రోజుకు 10 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనుండగా నాలుగు మోటార్ల ద్వారా 41.3 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా మోటర్లను సిద్ధం చేశారు.
ఎత్తిపోతలతో భూములు సస్యశ్యామలం
ప్రారంభోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
వట్పల్లి, జూన్19: తాలెల్మ ఎత్తిపోతల పథకంతో నాలుగు మండలాలు సస్యశ్యామలం కానున్నాయని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నా రు. మండలంలోని సాయిపేటలో మంత్రి హరీశ్‌రావు సోమవారం ప్రారంభించనున్న తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఎత్తిపోతలతో అందోల్, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమానికి రైతులు, పార్టీ శ్రేణులు భారీగా తరలిరావాలన్నారు.
ప్రారంభం పండుగను తలపించాలి
ఏండ్ల తరబడి ఇక్కడి రైతులు పడుతున్న సాగునీటి కష్టాలు తొలిగిపోనున్న సందర్భంగా నిర్వహించనున్న ఎత్తిపోతల ప్రారంభోత్సవం పండుగను తలపించాలి. నాలుగు మండలాల్లోన్ని 14 గ్రామాల రైతుల సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం ఖర్చుకు వెనకాడకుండా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. దీన్ని సైతం అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు కుటిల రాజకీయాలు చేసి రైతుల నోట్లో మట్టికొట్టాలనుకున్నారు.
కానీ రైతులు వారి ప్రలోభాలకు లొంగకుండా పూర్తి సహాయ సహకారాలు అందించడంతో ఎత్తిపోతల పథ కం పూర్తై అందుబాటులోకి వచ్చింది. ఎత్తిపోతలతో ఆయకట్టు రైతుల భూములకు పుష్కలంగా సాగు నీరంది వారు సంతోషంగా పంటలు సాగు చేసుకుంటారు. పథకం ప్రారంభం తర్వాత వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు చేపడుతాం. ప్రభ్వుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ ప్రాజెక్టులను నిర్మిస్తున్నది. ఎల్లమ్మ ఎత్తిపోతలు పూర్తి కాగా సంగమేశ్వర-బసవేశ్వర పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
– చంటి క్రాంతికిరణ్, అందోల్ ఎమ్మెల్యే
నాలుగు మండలాలకు ఎంతో ఉపయోగం
ఎత్తిపోతల పథకం ద్వా రా అందోల్‌తో పాటు వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల రైతులకు ఎం తో మేలు జరుగనున్నది. ఇక్కడ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలనేది ఇక్క డి రైతుల దశాబ్దాల కల. వారి కలను టీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసి బీడు భూములను సస్యశ్యామలం చేయనుండడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఎత్తిపోతలతో సుమారుగా 13వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నది.
– లింగాగౌడ్, ఎత్తిపోతల పథకం చైర్మన్