కోహీర్, జూన్18 : తెలంగాణలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతిని చేపట్టారని ఎమ్మెల్యే మాణిక్‌రావు పేర్కొన్నారు. శనివారం మం డలంలోని కొత్తూర్(డి)లో పల్లెప్రగతి భాగంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి కావాలంటే హరితహారం మొక్కలను నాటాలన్నారు. సీఎం కేసీఆర్ మంచి మనసుతో ఆలోచించి భవిష్యత్ తరాలకు అవసరమయ్యే ఆక్సిజన్ కోసం మొక్కలను నాటించారన్నారు. అనంతరం మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా అదనపు గదుల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సం దర్భంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్‌రావు, అదనపు డీఆర్డీవో సూర్యారావు, జడ్పీ సీఈవో ఎల్లయ్య, ఎంపీడీవో సుజాతనాయక్, ఎంపీవో వెంకట్‌రెడ్డి, ఎంఈవో శంకర్, సర్పంచులు రంగయ్య, రాజశేఖర్ పాల్గొన్నారు.
యువత కోసం క్రీడా ప్రాంగణాలు
యువత కోసం క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇంద్రేశం, పోచారం, ఘనపూర్, నందిగామ, భానూర్, క్యాసారం, ఇస్నాపూర్ గ్రామా ల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలసి ప్రారంభించారు. రుద్రారంలో సర్పంచ్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.8లక్షల 50వేలతో నిర్మించిన పల్లెప్రకృతివనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. యువత ఫిట్‌గా ఉండాలని కోరారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతివనాలు, క్రీడాప్రాంగణాలను సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎప్పుడు చూడని పార్క్‌లు, పచ్చదనం నేడు గ్రామాల్లో చూస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, జడ్పీటీసీ సుప్రజావెంకట్‌రెడ్డి, ఎంపీడీవో బన్సీలాల్, వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కార్యదర్శులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.