
తూప్రాన్/రామాయంపేట/చేగుంట/మనోహరబాద్/నిజాంపేట/తూప్రాన్ రూరల్/ కొల్చారం/ మెదక్‌రూరల్/ మున్సిపాలిటీ/చిలిపిచెడ్/రామాయంపేట రూరల్, నవంబర్ 19 : రామాయంపేట పట్టణంలోని రాజరాజేశ్వరాలయం, కాట్రియాల, అక్కన్నపేట తదితర గ్రామాల్లో హనుమాన్, శివాలయాల్లో ఘనంగా కార్తికమాస ఉత్సవాలు జరిగాయి. నిజాంపేట మండలంలోని ఎల్లమ్మ, హనుమాన్ దేవాలయాల్లో కార్తిక పూజలు నిర్వహించారు. చేగుంట మండలం ఉలి లతిమ్మాయపల్లె, కర్నాల్‌పల్లి తదితర గ్రామాల్లో శివాలయాల్లో శివపార్వతుల కల్యాణం నిర్వహించి ఒడిబియ్యం సమర్పిం చారు. తూప్రాన్ పట్టణంతో పాటు మండలంలోని ఇస్లాంపూర్ తదితర గ్రామాల్లో కార్తిక పౌర్ణమి సందర్భంగా భక్తులు ఆయా దేవాలయాల్లో, చెరువు కట్ట వీరాంజనేయస్వామి దేవాలయం, సాయిబాబా మందిరం, శివాలయం, శ్రీసీతారామ దేవాలయంతో పాటు ఆయా దేవాలయాల్లో భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. మనోహరాబాద్ మండలంలోని కాళ్లకల్ బంగారమ్మ దేవాలయం, శివాలయం, కూచారం శ్రీ సీతారామాంజనేయస్వామి ఆల యం, మనోహరాబాద్ శ్రీ సీతారామాంజనేయస్వామి దేవాలయంలో భక్తులు కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
కొల్చారంలో..
కొల్చారం మండలంలో పలు దేవాలయాలు కార్తిక శోభను సంతరించుకున్నాయి. మండల కేంద్రమైన కొల్చారంతో పాటు రంగంపేట, పైతర, చిన్నాఘన్‌పూర్, వరిగుంతం, సంగాయిపేట, ఎనగండ్ల గ్రామాల్లో కార్తిక పౌర్ణమి పురస్కరించుకుని శుక్రవారం శివలింగానికి అభిషేకం చేశారు. కొల్చారంలోని శివాలయం, భద్రకాళి సహిత వీరభద్ర దేవాలయంలో ఉదయం నుంచే భక్తుల సందడి నెలకొన్నది.
మెదక్‌లో..
కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని మండల పరిధిలో ఆయా గ్రామాల్లో కార్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామి వారికి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు , 11 వేల బిల్వా పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో 41 వేల దీపాలతో దీపారాధన చేశారు. పూజారి మల్లన్న స్వామి, అధిక సంఖ్యలో భక్తులు పాల్లొన్నారు.
చాముండేశ్వరీ అమ్మవారి ఆలయంలో ..
చిలిపిచెడ్ మండల చిట్కుల్ గ్రామ శివారులోని చాముండేశ్వరీ ఆలయంలో శుక్రవారం భక్తులు అధిక సంఖ్య లో పాల్గొ ని అమ్మవారిని దర్శించుకున్నారు. కార్తిక పౌర్ణమి సందర్భంగా దీపాలు వెలిగించారు. ఆలయం సమీపంలోని మం జీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పించారు. ఆల య ప్రధాన పూజారి ప్రభాకరశర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చాముండేశ్వరీ ఆలయం వద్ద సేవా సమితి శాక్త మండల్ ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ మెడికవర్ సంగారెడ్డి వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శుక్రవారం కార్తిక పౌర్ణమి సందర్భం గా భక్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించామని డాక్టర్ శ్రీధర్ తెలిపారు. డాక్టర్లు శైలజ, సమైక్య, పవన్ కుమార్ భట్నగర్, వేణు మాధవ్, సందీప్‌రెడ్డి, వేణుగోపాల్, అక్బర్ భక్తులకు పరీక్షలు నిర్వ హించారు.
రామాయంపేటలో..
రామాయంపేట మండలంలోని కోనాపూర్, డీ ధర్మారం, రాయిలాపూర్, దామర చెర్వు, అక్కన్నపేట, కాట్రియాల గ్రామాల్లో పౌర్ణమి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సదర్భంగా గ్రామాల్లో శివాలయాలు, పెద్దమ్మ దేవాలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో మహిళలు, చిన్నారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మెదక్ మున్సిపాలిటీలోని కొదండ రామాలయంలో దీపోత్సవాన్ని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ ప్రారం భించారు. ఆయన వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, కౌన్సిలర్ శ్రీనివాస్, ఆలయ కమిటీ అధ్యక్షుడు నరేం దర్ కమిటీ సభ్యులు ఉన్నారు.