తూప్రాన్, జూన్ 14: క్రీడాలతో శారీరక ధృడత్వం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని ఇస్లాంపూర్ గ్రామ శివారులో రామప్ప దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ క్రీడా ప్రాంగణం’ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నేటి తరం పిల్లలు టీవీలు, సెల్ఫోన్లకే అంకితమవడంతో, క్రీడలపై ఆసక్తి తగ్గుతుందన్నారు. విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదగడంతో పాటు క్రీడల్లో రాణించడానికి క్రీడా ప్రాంగణాలు ఎంతో తోడ్పడతాయన్నారు.
సీఎం కేసీఆర్ కృషితో ఇవా ళ ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టమన్నారు. అనంతరం క్రీడా ప్రాంగ ణ సమీపంలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతివనాన్ని పరిశీలించి సూచన లు చేశారు. జడ్పీ నిధులతో క్రీడా ప్రాంగణానికి ప్రహారి నిర్మించడానికి సహకరించాలని సర్పంచ్ సుకన్య కోర గా, జడ్పీ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమం లో ఇస్లాంపూర్ సర్పంచ్ సుకన్యారమేశ్, ఎంపీటీసీ నర్స వ్వ, జడ్పీటీసీ రాణిసత్యనారాయణ, మండల అధ్యక్షు డు బాబుల్‌రెడ్డి, ఎంపీడీవో అరుంధతి, తూప్రాన్ ము న్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, రైతు సమన్వయసమితి కో-ఆర్డినేటర్ సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ రాజు, ఆత్మకమిటీ సభ్యులు భిక్షపతి, నరేందర్‌గౌడ్, సుధాకర్, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.