దుబ్బాక, జూన్ 11 : లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీలో ప్రజాప్రతినిధులే బాధ్యత తీసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. దుబ్బాక మున్సిపల్, మండలంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరలో లబ్ధిదారులకు అందించనున్నామని స్పష్టం చేశారు. శనివారం దుబ్బాక మండలం పోతారంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి తమ నివాసంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ పాలకవర్గం, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
దుబ్బాక పట్టణంలో నిర్మించిన 872 డబుల్ బెడ్రూంలకు 587 ఇండ్లకు సంబంధించిన లబ్ధిదారులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు. లబ్ధిదారులకు కేటాయించిన ఇండ్లను ప్రారంభోత్సవానికి ముస్తాబు చేసుకోవాలని సూచించారు. దుబ్బాక పట్టణంతో పాటు మండలంలోని పెద్దగుండవెల్లి, చీకోడ్, గంభీర్పూర్, పోతారం, రఘోత్తంపల్లి, గోసాన్‌పల్లి, చౌదర్పల్లి, రామేశ్వరంపల్లి, చిన్ననిజాంపేట గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులకు సోమవారం ధ్రువపత్రాలు అందజేయాలని తహసీల్దార్‌కు సూ చించారు. ఈ నెల 30లోపు దుబ్బాక, మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేయాలన్నారు. దుబ్బాకలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీల్లో ఇంటింటికీ నల్లానీరు, మురుగు కాల్వలు, అంతర్గత సీసీ రోడ్లు, విద్యుత్ సరఫరాపై సమీక్షించారు. దుబ్బాక బస్టాండ్ పనులపై ఆర్టీసీ అధికారులతో చర్చించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సమీ క్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ గణేశ్‌రెడ్డి, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, ఎలక్ట్రిసిటీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుల సంఘాల భవనాలకు శంకుస్థాపన
దుబ్బాక పట్టణంలో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణ పనులకు శనివారం ఎంపీ భూమిపూజ చేశారు. రూ.10 లక్షలతో భవనాన్ని నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
దుబ్బాకలో రూ.5 లక్షలతో గొర్రెల కాపరుల సహకార సంఘం భవనానికి భూమిపూజ చేశారు. దుబ్బాక మండలం గోసాన్‌పల్లిలో సర్పంచ్ దొందడి లక్ష్మి భర్త అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. కుటుం బ సభ్యుకులకు రూ.5 లక్షల ఎల్వోసీని అందజేశారు. ఎంపీ వెంట మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వంగ బాల్‌రెడ్డి, రేకులకుంట దేవాలయ చైర్మన్ రొట్టె రమేశ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.