మెదక్ మున్సిపాలిటీ/ రామాయంపేట/ నర్సాపూర్/ తూ ప్రాన్, జూన్ 11 :జిల్లాలోని మున్సిపాలిటీల్లో 9వ రోజు శనివారం 4వ విడుత పట్టణ ప్రగతి పనులు జోరుగా జరుగుతున్నాయి. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూ ప్రాన్ మున్సిపాలిటీల్లో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు వార్డుల్లో పర్యటిస్తున్నారు. వార్డుల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ వార్డు సభలను నిర్వహిస్తున్నారు. స్థానిక సమస్యలను గుర్తిస్తూ.. ప్రాధాన్యత క్రమంలో తక్షణమే పరిష్కరిస్తున్నారు. మున్సిపల్ చైర్మన్లు ప్రజలతో మాట్లాడుతూ పట్టణ ప్రగతి పను ల్లో భాగస్వాములు కావాలని అవగాహన కల్పిస్తున్నారు.
పట్టణ ప్రగతితో సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నట్లు మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ తెలిపారు. మెదక్ పట్టణం లోని 5, 6వ వార్డుల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, కమిషనర్ శ్రీహరి, కౌన్సిలర్లు ఆంజనేయులు, వనజతో కలిసి వార్డుసభలు నిర్వహించి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 5వ వార్డులోని పార్కులో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామన్నా రు. కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, డీఈ, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్, ఆత్మ కమి టీ వైస్ చైర్మన్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గంగాధర్, ప్రత్యేకాధికారులు, మెప్మా ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గ్గొన్నారు.
రామాయంపేట పట్టణంలోని నర్సరీలను మున్సిపల్ చైర్మ న్ జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీనువాసన్ పరిశీలించారు. వచ్చే హరితహారంలో భాగంగా ప్రతి ఇంటి ఆవరణలో ఐదు చొప్పు న మొక్కలను నాటించి పట్టణాన్ని హరితవనంగా మార్చుతామన్నారు. వారివెంట మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, ఏఈ యుగంధర్, మన్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
తూప్రాన్ పట్టణంలోని 5వ వార్డులో క్రీడా ప్రాంగణ పనులను మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, స్థానిక నాయకుడు చెలిమెల రఘుపతి పరిశీలించారు. 8వ వార్డులో కౌన్సిలర్ లావణ్యాదుర్గారెడ్డి, 15వ వార్డులో కౌన్సిలర్ రామునిగారి శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు.