జిల్లావ్యాప్తంగా 5వ విడుత పల్లె ప్రగతి పనులు శనివారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు గ్రామస్తులతో కలిసి పల్లె ప్రగతి పనులను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పల్లెల్లో పరిస రాల పరిశుభ్రత, స్వచ్ఛత పనులు, పారిశుధ్య పనులు నిర్వ హిస్తు న్నారు. రోడ్లను శుభ్రపర్చడం, చెత్తాచెదారాన్ని తొలిగిం చడం, మురుగునీటి కాల్వలను శుభ్రం చేయించడం, ఇండ్లలో లభిం చే చెత్తను తడి, పొడిగా సేకరించడం, డంపింగ్ యార్డుల్లో చెత్తను వేరు చేయడం, కంపోస్టు ఎరువు తయారీ పను లు చేపడుతున్నారు. హరితహారంలో భాగంగా నర్సరీల్లో మొక్క ల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటించి, పల్లె ప్రగతి పనుల ను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలను స్థానిక అధికారులకు ఇస్తూ పనులను కొనసాగిస్తున్నారు.
నిజాంపేట మండలంలో పల్లెప్రగతి పనులను ఎంపీడీవో వెంకటలక్ష్మి పరిశీలించారు. వారివెంట ఎంపీవో రాజేందర్, సర్పంచ్ అనూష, ఎంపీటీసీ లహరి, మిషన్ భగీరథ ఏఈ భిక్షపతి, కార్యదర్శి నర్సింహులు ఉన్నారు.
రామాయంపేట మండలం డీ.ధ ర్మారం గ్రామంలో ఫంక్ష న్హాల్, అదనపు గదుల పనులను మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో యాదగిరిరెడ్డి పరిశీలించారు. సుతారిపల్లిలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డులను పరిశీలించారు. కాట్రియాలలో సర్పంచ్ మైలారం శ్యాములు అధ్వర్యంలో గ్రామస్తులు శ్రమదానం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీటీసీలు, కార్యదర్శులు, ప్రజాప్రతిని ధులు సిద్ధ్దిరాంరెడ్డి, బొడ్డు శంకర్, సంధ్య, శ్యామల, పద్మ, నర్సింహులు, రమేశ్‌గౌడ్, స్రవంతి, రాజేందర్ ఉన్నారు.
పల్లె ప్రగతి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. ఫరీద్‌పూర్‌లో పల్లె ప్రగతి పనులను ఎంపీడీవో శ్రీరామ్‌తో నలిసి పరిశీలించారు. వీరివెంట వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, సర్పంచ్ సౌందర్య, ఎంపీటీసీ రాజయ్య, ఎంపీవో ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి శ్రీవిద్య పాల్గొన్నారు.
చిలిపిచెడ్ మండలంలో పల్లె ప్రగతిను ఎంపీడీవో కృష్ణమోహన్ పరిశీలించారు. శీలాంపల్లిలో ప్రజలతో కలిసి సర్పంచ్ కవితాముకుందరెడ్డి శ్రమదానం చేశారు.
మనోహరాబాద్ మండలంలోని మనోహరాబాద్, పోతా రం, పర్కిబండ, గౌతోజిగూడెం, ముప్పిరెడ్డిపల్లి, కొనాయిపల్లిపీటీ, దండుపల్లి, కాళ్లకల్ గ్రామాల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు శ్రమదాన చేపట్టి, రోడ్లను శుభ్రపరిచారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మహిపాల్‌రెడ్డి, నర్సయ్య, వెంకటేశ్వర్లు, మాధవరెడ్డి, అర్జున్, ఉప సర్పంచ్‌లు రేణుకుమార్, వీరేశ్, కరుణాకర్‌రెడ్డి, రాజుయాదవ్, శ్రీహరి, నాయకులు మహేశ్, నీలగిరిగౌడ్, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
టేక్మాల్ మండలకేంద్రంలో ఎంపీడీవో లక్ష్మి, ఎంపీపీ స్వప్న పర్యటిం చారు. సర్పంచ్ సుప్రజాభాస్కర్, కార్యదర్శి పరిపూర్ణ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులు నిర్వహించారు.