మనోహరాబాద్/ చిలిపిచెడ్, జూన్ 11 : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలాభివృద్ధి సాధ్యమని జడ్పీ చైర్ప ర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మం డలం వెంకటాపూర్ అగ్రహారంలో పల్లె ప్రగతిలో భాగంగా పల్లె నిద్ర చేశారు. శుక్రవారం రాత్రి గ్రామస్తులతో సమావేశాన్ని నిర్వహించి పల్లె ప్రగతి ప్రాముఖ్యత వివరించారు. శనివారం ఉదయం గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ తడి, పొడి చెత్త వేరు చేసే పద్ధతి, పరిసరాల శుభ్రతను మహిళలకు వివరించారు. చెట్లగౌరారం, రంగాయిపల్లి గ్రామాల్లో పర్యటించి, గ్రామస్తులతో కలిసి శ్రమదానం చేశారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ ఆడిగి తెలుసుకున్నారు. పారిశుధ్య నిర్వహణలో మహిళలదే కీలకపాత్ర అన్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం, మొక్కల పెంపకం, మురుగునీరు నిల్వ చేరకుండా చూసుకోవాల్సిన బాధ్యత మహిళలదేనన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్ముదిరాజ్, ఎంపీడీవో కృష్ణమూర్తి, వైస్ ఎంపీపీ విఠల్‌రెడ్డి, ఎంపీవో లక్ష్మీనర్సింహ, సర్పంచ్‌లు రేణుకాఆంజనేయులు, నాగభూషణం, నర్సయ్య, ఉప సర్పంచ్ ఆం జనేయులు, వార్డు సభ్యులు శ్రీశైలం, అశోక్, రాధిక, సుశీల, మల్లికార్జున్‌గౌడ్, స్వప్న, లక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు కుమార్‌గౌడ్, శ్రీశైలం, యాదమ్మ, నీలగిరిగౌడ్ ఉన్నారు.
సమస్యల పరిష్కారానికే పల్లె నిద్ర
గ్రామ సమస్యలను పరిష్కారించడానికే పల్లెనిద్ర నిర్వహిస్తున్నట్లు చిలిపిచెడ్ మండల ప్రత్యే కాధికారి జనార్దన్‌రావు అన్నారు. ఫై జాబాద్లో అధికారులు పల్లెనిద్ర చే శారు. పల్లెనిద్రలో ఎంపీపీ వినోద, ఎంపీడీవో కృష్ణమోహన్, సర్పంచ్ మ నోహర, ఎంపీటీసీ మల్లమ్మ, ఏపీవో శ్యాంకుమార్, ఉపసర్పంచ్ రాములు, కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.