మెదక్ అర్బన్/ సంగారెడ్డి అర్బన్, జూన్11: నూతనంగా ఏర్పాటు చేసిన మెదక్, సంగారెడ్డి జిల్లాల కోర్టులను హైకోర్టు న్యాయమూర్తి (మెదక్, సంగారెడ్డి అడ్మినిస్ట్రేషన్ న్యాయమూర్తి) శ్రీదేవి శనివారం వేర్వేరుగా పరిశీలించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, సిబ్బంది వివరాలతో పాటు కావాల్సిన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కావాల్సిన సౌకర్యాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి సమకూర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మెదక్‌లో న్యాయమూర్తికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీ శారద ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం మెదక్ బార్ అసోసియేషన్‌లో అధ్యక్షుడు ఎం.బాలయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కోర్టు ఏర్పాటు సందర్భంగా మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులకు, సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం రెవెన్యూ అధికారులతో కలిసి కోర్టుకు కేటాయించిన ఖాళీ స్థలాలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో మెదక్‌లో సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కల్పన, మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, ఇప్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, ఆర్డీవో సాయిరాం, మెదక్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీను, ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ శ్రీవాత్సవ్, కోశాధికారి దుర్గారెడ్డి, స్పోర్ట్ అండ్ కల్చరల్ సెక్రటరీ నర్సింలు, న్యాయవాదులు ప్రతాప్‌రెడ్డి, పోచయ్య, చంద్రారెడ్డి, లక్ష్మణ్‌కుమార్, శ్రీనివాస్‌గౌడ్, రవిగౌడ్, జీవన్, కిరణ్‌రాజ్, అలిబెగ్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శశిధర్‌రెడ్డి, సీనియర్ సివిల్ జడ్జి పుష్పలత, జిల్లా న్యాయసేవాధికార కార్యదర్శి ఆశాలత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అబ్దుల్ జలీల్, అదనపు ప్రథమ శ్రేణి జడ్జి కుమారి తేజశ్రీ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్, కోశాధికారి ఉదయ్, శ్రీనివాస్, రమాదేవి, విఠల్‌రెడ్డి, నిజామోద్దీన్ రషీద్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. కాగా, సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జిని సన్మానించారు.
వన దుర్గామాతకు ప్రత్యేక పూజలు
పాపన్నపేట, జూన్ 11: ఏడుపాయల వన దుర్గామాతను శనివారం హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి ఆలయ చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి, సీనియర్ సివిల్ జడ్జి జితేందర్, మెదక్ జడ్జి లక్ష్మీశారద, నర్సాపూర్ జూనియర్ జడ్జి అనితతో కలిసి అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ సైదులు, పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ తదితరులున్నారు.