మెదక్ మున్సిపాలిటీ, మే 31 : రాష్ట్ర ప్రభుత్వం చేపడతున్న పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతి నిధులతోపాటు మున్సిపల్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ సూచించారు. మంగళవారం మెదక్ మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ.. జూన్ 3 నుంచి ప్రారంభమయ్యే పట్టణ ప్రగతి 15 రోజులు కొనసాగుతుందన్నారు. వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సి లర్లు పరిష్కరించాలని సూచించారు. పట్టణ ప్రగతి కోసం ము న్సిపాలిటీకి నలుగురు ప్రత్యేక ఆధికారులను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో అధికారి 8 వార్డులకు ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. పట్టణ ప్రగతి పనులకు 4 జేసీబీలు, 4 బ్రో జర్లు, 4 ట్రాక్టరు అందుబాటులో ఉంటాయన్నారు. పట్టణం లో మూడు బృహత్ ప్రకృతి వనాలకు హనుమంత్‌రావు నగర్ కాలనీ, మీరా కాలనీ, ఇందిరపురి కాలనీల్లో స్థలాలను గుర్తించామని తెలిపారు. హరితహారంలో భాగం గా వార్డుల్లోని ఖాళీ స్థలాలను గుర్తించి, మొక్కలను నాటిస్తామని వివరించారు.
అన్ని వార్డుల్లో తాగునీరు అందించాలి
కొన్నివార్డుల్లో మిషన్ భగీరథ తాగునీరు సరిగా రావడం లేదని, అన్నివార్డుల్లో తాగు నీటిని అందించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డీఈ మహేశ్‌కు వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్ సూచించారు. మిషన్ భగీరథ పైపులైన్లకు తీసిన గుంతలతో అరబ్గల్లి, నవాబుపేట తదితర వీధుల్లో రోడ్లు ఆధ్వా నంగా మారాయని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. గుంతలను పూడ్చడానికి ప్రతిపాదనలు తయారు చేసి టెండర్ నిర్వహించి పనులు చేపట్టాలని మున్సిపల్ డీఈని చైర్మన్ ఆదేశించారు. గిద్దకట్ట శ్మశానవాటికలో లైటింగ్, నీటి సౌకర్యం కల్పించాలని కౌన్సిలర్ కృష్టారెడ్డి కోరారు. టెండర్ నిర్వహించి నెల రోజుల్ల పనులు ప్రారంభిస్తామని డీఈ జవాబిచ్చారు. విలీన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదని, టౌన్ ప్లానింగ్ అధికారులకు సమస్యలను వివరించినా పట్టించుకోవ డం లేదని ఫిర్యాదు చేశారు.
సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే మున్సిపల్ సమావేశం రోజున విలీన గ్రామాల ప్రజలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కౌన్సిలర్ విశ్వం హెచ్చరించారు. రాందాస్ చౌరస్తా నుంచి లేబర్ అడ్డాను వేరే ప్రాంతానికి తరలించాలని, లేబర్ అడ్డాతో ప్రధాన రోడ్డుపై ప్రమాదాలు జరగడంతోపాటు ఇబ్బందులు వస్తున్నట్లు కౌన్సిలర్ కల్యాణి ఫిర్యాదు చేశారు. పట్టణంలో ఖాళీ స్థలాలను గుర్తించిన తర్వాత లేబర్ అడ్డాను తరలిస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. పట్టణంలోని ప్రధాన రోడ్లకు గతంలో మహనీయుల పేర్లు ఉండేవని, రోడ్లను గుర్తించేలా బోర్డులు ఏర్పాటు చేయిం చాలని కౌన్సిలర్ మేఘమాల విజ్ఞప్తి చేశారు.
సమావేశాన్ని వాకౌట్ చేసిన మహిళా కౌన్సిలర్లు
వార్డులో చేపట్టే అభివృద్ధి పనులపై సమాచారం ఇవ్వడం లేదని 9వ వార్డు కౌన్సిలర్ కల్యాణి మండిపడ్డారు. 9 వార్డులో క్రీడా మైదానం ఏర్పాటుపై సమాచారం ఇవ్వరా? అని ప్రశ్నించారు. గతంలో కుట్టుమిషన్ల పంపిణీపై సమాచారం ఇవ్వలేదన్నారు. అధికారుల వైఖరికి నిరసనగా సమావేశాన్ని వాకౌట్ చేస్తున్నానని ప్రకటించారు. దీంతో కల్యాణి వెంట కౌన్సిలర్లు మమత, రుక్మిణీ సైతం సమావేశం నుంచి బయటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. సమస్యలను అందరికీ సమాచారం ఇస్తున్నట్లు డీఈ మహేశ్ పేర్కొన్నారు.
మున్సిపల్ ఆఫీసుపై అంతస్తులోని మీటింగ్ హాల్‌ను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నట్లు, వచ్చే సమావేశాన్ని నూతన హాల్లో నిర్వహిస్తామని చైర్మన్ చంద్రపాల్ తెలిపారు.
సమావేశంలో కౌన్సిలర్లు ఆంజనేయులు, జయరాజ్, శ్రీనివాస్, శేఖర్, లక్ష్మీనారాయణగౌడ్, వసంత్‌రాజ్, లింగం, సుం కయ్య, సమియొద్ద్దీన్, లలిత, సులోచన, యశోధ, లక్ష్మి, వేదవతి, నర్మద, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, ఏఈలు బాలయసాయగౌడ్, సిద్ధేశ్వరి, టీపీఎస్ దేవరాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్, ఆర్ఐ హర్షద్, సిబ్బంది ఉన్నారు.