
రామాయంపేట, నవంబర్ 14: పల్లె ప్రకృతి వనాలతో పల్లెకు కొత్త అందాలను తెచ్చింది. సీఎం కేసీఆర్ ఒ క్కో పల్లె ప్రకృతి వనానికి రూ.2.70లక్షల నిధులను మంజూరు చేశారు. మండల వ్యాప్తంగా 15 పల్లె ప్రకృతి వనాలను అధికారులు నిర్మించి పనులు పూర్తిచేసి మొక్కలు నాటారు. మండలంలోని 15 పంచాయతీలకు గాను రూ.40లక్షల నిధులను కేటాయించారు. మండలానికి ఒక్క బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. మండల వ్యాప్తంగా స్థలం లేకపోవడంతో కోనాపూర్‌లో పదెకరాల ప్రభుత్వ భూ మిలో వనాన్ని నిర్మించి 10,400 మొక్కలను నాటారు.గిరిజన తండాలకు కూడా ప్రభుత్వం గార్డెన్ ఉండాలనే ఉద్దేశంతో సదాశివనగర్ గిరిజన తండాలో సర్వే చేసి మరో రూ.2 లక్షల70వేల నిధులను అదనంగా మంజూరు చేసింది. పల్లెల్లో ప్రజలకు ప్రకృతి వనాలు ఎంతో ఉపయోగపడుతాయి.
పల్లె ప్రకృతి వనాలు పనులు పూర్తి
ప్రభుత్వం మండలానికి 16 పల్లె ప్రకృతి వనాలను మంజూరు చేసింది.15 పంచాయతీలతోపాటు సదా శివనగర్ గిరిజన తండాలో సైతం అదనంగా పల్లె ప్రకృతి వనం పూర్తయ్యింది. మండలానికో బృహత్ పల్లె ప్రకృతి వనం కూడా ప్రభుత్వం మంజూరు చేసింది.ఎక్కడా అనువైన స్థలం లేకపోవడంతో కోనాపూర్‌ను ఎంపిక చేసి పదెకరాల భూమిలో నిర్మించి పనులు కూడా పూర్తి చేసి 10, 400 మొక్కలు నాటాం.
-యాదగిరిరెడ్డి , ఎంపీడీవో రామాయంపేట