మెదక్ మున్సిపాలిటీ, మే 3: రాష్ట్రంలోని బల్దియాలు, మున్సిపల్ కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం, వాటి పాలకవర్గాలను విస్మరించడం లేదు. అభివృద్ధిలో పాలకవర్గాల కృషి ఎంతో ఉంది. వారిసేవలను గుర్తించి రాష్ట్ర ప్రభు త్వం మున్సిపల్ పాలకవర్గాలకు తీపికబురు అందించింది. పాలకవర్గాల గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వేతనాల పెంపు 2021 జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట్, తూప్రాన్ 4, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, చేర్యాల, హుస్నాబాద్ 5, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం, 8 ము న్సిపాలిటీలు ఉన్నాయి. యాభైవేల పైబడిన బల్దియాల్లో సంగారెడ్డి, సిద్దిపేట, గజ్వేల్-ప్రజ్ఞాపూర్, అమీన్పూర్, తెల్లాపూర్, సదాశివపేట, మెదక్ ఉన్నాయి.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
అడగక ముందే పాలకవర్గాల గౌరవ వేతనం పెంచిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. దేశంలో ఎక్కడా లేని విధంగా పట్టణ ప్రగతి ద్వారా మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రతినెలా నిధులు సమకూర్చుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉం టాం. బల్దియాలు, మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నది. ప్రభుత్వ సహకారంతో మెదక్ బల్దియాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.
– తొడుపునూరి చంద్రపాల్, మున్సిపల్ చైర్మన్ మెదక్
ఆనందంగా ఉంది..
పాలకవర్గాల గౌరవ సభ్యుల వేతనాలు పెంచ డం ఆనందంగా ఉంది. మున్సిపాలిటీల అభివృద్ధి కి నిరంతరం కృషిచేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు. వేతనాల పెంచడంతో మాపై మరింత బా ధ్యత పెరిగింది. ప్రభుత్వ ఆశయానికి అనుగుణం గా పనిచేసి బల్దియాను అభివృద్ధి చేస్తాం.
– ఆరేళ్ల గాయత్రి, కౌన్సిలర్ మెదక్