నర్సాపూర్, మే 3: రైతులను అన్ని విధాలా ఆదుకునే సత్తా కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వానికే ఉందని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. అనంతరం మండల పరిధిలోని పెద్దచింతకుంట, ఖాజీపేట్, తిర్మలాపూర్, తుజాల్పూర్, నర్సాపూర్‌లోని మార్కెట్ యా ర్డుల్లో పర్యటించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నదని వెల్లడించారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయనంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధాన్యా న్ని కొనుగోలు చేస్తామని ప్రకటించి రైతులకు భరోసా కల్పించారని తెలిపారు. ధాన్యం నిలువ చేసుకోడానికి కావాల్సిన సంచులను కూడా కేంద్రప్రభుత్వం అడ్డుకుంటుందని రైతులు ఓపికతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద విక్రయించాలని సూచించారు. చివరి గింజ వరకూ కొనుగోలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్స న్ అనసూయ అశోక్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఎంపీపీ జ్యోతిసురేశ్నాయక్, వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అశోక్‌గౌడ్, శ్రీధర్‌గుప్తా, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, జడ్పీటీసీ బాబ్యానాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, ఏపీఎం గౌరీశంఖర్, సర్పంచులు హేమలతామదన్మోహన్, శివకుమార్, శ్రీరాములు, కవిత, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.