శివ్వంపేట, మే 1: దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని తిమ్మాపూర్ దళితబంధు స్కీంకు ఎంపికైంది. లబ్ధిదారులు తప్పెట్ల వీరస్వామి, తప్పెట్ల లక్ష్మి, తప్పె ట్ల దుర్గయ్యలకు చెందిన పశువుల షెడ్లు, మినీడెయిరీకి అవసరమైన బోర్లను ఆదివారం సర్పంచ్ అనూషా అశోక్‌గౌడ్ తో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ప్రతీ దళిత కుటుంబానికి రూ.10లక్షలు అందజేస్తామన్నారు. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా నచ్చిన వ్యాపారం చేసుకుని ఆర్థికంగా పూర్తి సాధికారత సాధించాలన్నారు. దళితులందరి పక్షాన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు లావణ్యమాధవరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, ఎంపీటీసీలు నువ్వుల దశరథ, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు ఘన స్వాగతం
తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేస్తానని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మోకాలి శస్త్ర చికిత్స అనంతరం ఎమ్మెల్యే నర్సాపూర్‌కు మొదటిసారిగా రావడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. నర్సాపూర్ నుంచి శివంపేట్ మండలం చాకరిమెట్ల దేవస్థానం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. స్వాగతం పలకడానికి తరలివచ్చిన నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులను చూసి బావోద్వేగానికి లోనై, కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, ఏఎమ్‌సీ చైర్పర్సన్ అనసూయ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ హబీబ్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, నాయకులు అశోక్‌గౌడ్, శ్రీధర్‌గుప్తా, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజుయాదవ్, ఏఎమ్‌సీ డైరెక్టర్లు రావూఫ్, సాగర్, జ్ఞానేశ్వర్, విక్రమ్‌రెడ్డి, గొర్రె వెంకట్, నగేశ్, ఆంజనేయులు పాల్గొన్నారు.